Share On

క‌రోనా నేప‌థ్యంలో దేశంలోని దాదాపుగా అన్ని కోర్సుల ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. కాని ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తేనే డిగ్రీ ప‌ట్టాలు ఇస్తామ‌ని, అందులో యూజీసీ నియ‌మాలు మార్చ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడుతూ డిగ్రీలు ప్ర‌దానం చేసే ప్ర‌క్రియ‌లో నియ‌మాల‌ను రూపొందించే హ‌క్కు కేవ‌లం యూజీసీకి మాత్ర‌మే ఉంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యూజీసీ నియ‌మావ‌ళిని మార్చ‌లేవ‌న్నారు. కోవిడ్19 నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా డిగ్రీలు ఇవ్వ‌లేమ‌న్నారు. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు ఆగ‌స్టు 14కు వాయిదా వేసింది. కోవిడ్ నేప‌థ్యంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అయితే ఆ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స్పందించేందుకు యూజీసీకి సుప్రీం కొంత గ‌డువును ఇచ్చింది. అశోక్ భూష‌ణ్‌, సుభాష్ రెడ్డి, షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని గ‌తంలో యూజీసీ చెప్పింది. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఓవ‌ర్‌రైడ్ చేస్తుందా అని ఈ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. విద్యార్థులు చ‌దువుతూనే ఉండాల‌ని, కానీ వాళ్లు ప‌రీక్ష‌లు రాయ‌నంత వ‌ర‌కు వారికి డిగ్రీలు ఇవ్వ‌లేర‌ని మెహ‌తా తెలిపారు.


Share On
2 thoughts on “ప‌రీక్ష‌లు రాస్తేనే డిగ్రీ ప‌ట్టాలు ఇస్తాం.. యూజీసీ”
  1. Pallello galli llo rase exams rase vallani pass chesaru.. ..campus la lo gani private institutions Pg, degree chesevallu other countries vallu kuda untaru.. Ela exams pedthe corona undagaa other countries vallu vachi ala rastaru…vachinaa vallu ekkadiki vache sariki confirm gaa corona vastadhi… Ala university motham spred aithadhi….. Alage exam s rasina pg patta vache sariki pranaluntai anna nammakam led…… ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!