Share On

ఇప్పుడంతా సోష‌ల్ మీడియా.. సోష‌ల్ మీడియాను మంచిగా, వ్యాపార‌ప‌రంగా ఎంత వాడుకుంటే అంత ఆదాయం వ‌స్తుంద‌నేది వాస్త‌వ‌మే.. అందుకే చాలా మంది వారి ఉద్యోగాల‌ను వ‌దిలేసి సోష‌ల్ మీడియా వైపే దృష్టి సారిస్తున్నారు. కొంత‌మంది వెబ్‌సైట్ వైపు అడుగులు వేస్తుంటే, మ‌రికొంత‌మంది యూట్యూబ్ పెడుతూ వేల‌ల్లో ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు.

హర్యానాలోని నౌరంగాబాద్‌ అనే చిన్న గ్రామంలో బబితా వంట‌లు బాగా చేస్తోంది. తినడానికే కాదు చూడటానికి కూడా బాగుంటుందని తెలిసి ఆవిడ మ‌రిది వదిన చేసే వంట వీడియోలను యూట్యూబ్‌లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. యూ ట్యూబ్‌ వీడియో చానల్‌ ఎవరైనా ఎప్పుడైనా మొదలెట్ట వచ్చని తెలిశాక అతడు ఆగలేదు. ఇండియన్‌ గర్ల్‌ బబితాస్‌ విలేజ్‌’ పేరుతో వీడియో చానల్‌ ఓపెన్‌ చేసి మొదటిసారి దానిని అప్‌లోడ్‌ చేశాడు. అలా 2017లో వారి చానల్‌ మొదలయ్యింది. అయితే మొదటి వీడియోను ఎవరూ పెద్దగా చూడక‌పోయే స‌రికి ఎడిటింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ‘మృదువైన రొట్టెలు తయారు చేయడం ఎలా’ అని వదిన తో వీడియో చేయ‌డంతో రెండు రోజుల్లోనే దానికి పది లక్షల వ్యూస్ వచ్చేస‌రికి ఆశ్చ‌ర్య‌పోయారు. తొలి పారితోషికం 13,400 రూపాయలు. అవి పడిన రోజు ఆ ఊరంతా ఒక వింతగా చెప్పుకున్నారు. కుటుంబం ఆనందానికి అంతే లేదు. ఆ తర్వాత నెలకు కచ్చితంగా నాలుగైదు కొత్త వీడియోలు అప్‌లోడ్‌ అయ్యేలా చూసుకున్నారు. రోజురోజు వ్యూస్ డ‌బ్బులు పెర‌గుతూనే ఉన్నాయి. వ‌చ్చిన డ‌బ్బుతో‌ మంచి ఫోన్లు, కెమెరా స్టాండ్లు, లాప్‌టాప్‌ కొన్నాడు. మిగిలిన డబ్బు ఎలాగూ కుటుంబానిదే. ఇప్పటికి ఈ వదినా మరిది కలిసి 124 వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఈ చానల్‌కు ఉన్నారు. హర్యాణాలోని మారుమూల పల్లెటూళ్లో ఒక వంట గది నుంచి కూచుని ఇంత ఉపాధి పొందవచ్చు అని వీరు నిరూపించారు. ఇప్పుడు చాలామందికి యూట్యూబ్ మంచి ఉపాధి మార్గంగా మారిపోయింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!