Share On

కొంత‌మంది అధికారులు.. వారు చేసే సేవలు.. ప్ర‌జ‌ల‌కు వారికి మ‌ధ్య ఉండే అనుబంధం వ‌ర్ణించ‌లేనిది. అత‌ను ప‌నిచేసి ఉన్న‌త చ‌దువుల కోస‌మో లేదా ఇత‌ర ప్రాంతాల‌కు బ‌దిలీపై వెళుతున్న‌ప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతున్న‌బాధ‌, వారు క‌న్నీటితో ప‌లుకుతున్న వీడ్కోలు జీవితంలో మ‌రిచిపోలేనిది. 32 సంవ‌త్స‌రాల డా. కిషోర్ చంద్ర ఒరిస్సాలోని తెంతుల్ కుంటి ఫిర్కాలో ప్ర‌జ‌ల‌కు క‌నిపించే నిజ‌మైన దేవుడు. వయస్సులో చిన్నవాడే ఐనా గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా 70వేల మందికి ఆధారమైన ఒకే ఒక ఆస్పత్రిని గుడిగా మార్చిన మహానుభావుడు అత‌ను. తన సర్వస్వం ప్రజల కోసం ధారపోశాడు. ఎక్కడ ఏం జరిగినా, ఏ గ్రామంలో ఎవరికి వ్యాధి సోకినా, రోగులు ఆస్పత్రికి రాలేకపోయినా, తానొక్కడే రాత్రిపగలు తేడా లేకుండా వెళ్ళి రోగులకు చికిత్స చేసేవాడు. రేయింబవళ్ళు నిరంతరం రోగుల సేవలోనే గడిపిన ఈ వైద్యుడు నిజంగా మ‌రిచిపోలేని మ‌హానీయుడు. చిన్నవయసులో ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ వైద్యుడు డాక్టర్ కిషోర్ చంద్ర ఆర్ధోపెడిక్స్ లో పీజీ చేసేందుకు స్టడీ లీవ్ కింద భువనేశ్వర్ వెళుతున్నారు. విష‌యం తెలుసుకొని ప్ర‌జ‌లు ప‌దివేల‌మందికి పైగా డాక్టర్ కు వీడ్కోలు
ఆసుప‌త్రి నుంచి మేళ‌తాళాల‌తో, పూల‌పాన్పుపై న‌డిపిస్తూ సాగ‌నంపారు. ఒరిస్సా ప్రభుత్వ ఆరోగ్యశాఖ
ముఖ్య కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ కుమార్ మెహర్దా మాట్లాడుతూ కిషోర్ చంద్రను చూసి తామంతా గర్వపడుతున్నామని, దేశంలో డాక్టర్లకే ఆయన రోల్ మోడల్ అని ప్రశంసించారు. ఒరిస్సా ప్రభుత్వం కూడా కిషోర్ చంద్రకు స్టడీ లీవ్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న ఆసుప‌త్రిలోనే ఆయనకు పోస్టింగ్
ఇస్తామని ప్రకటించింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!