Share On

ప‌రిశుభ్ర‌త పాటించాలి.. అంద‌రూ బాధ్య‌త‌గా మెలగాలి.. ఎవ‌రికి వారుగా స్వ‌చ్చ‌భార‌త్ కోసం ముందుకు నడిచిన‌ప్పుడే ప‌రిశుభ్ర‌మైన దేశంగా, న‌గ‌రంగా మార్చుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్నా కొంత‌మంది మాత్రం మాట విన‌డం లేదు. ఇష్టానుసారంగా రోడ్ల‌మీద‌నే చెత్త‌ను వేస్తూ అంతా క‌లుషితం చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడ‌లో ఒక మహిళ రోడ్డుపై చెత్తను పారేయడాన్ని గమనించిన అధికారి ఆ చెత్తను తిరిగి ఆమె ఇంటి ముందు వేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఈ ఘటన జరిగింది. కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వాప్నిల్ దినకర్ పుండ్కర్ స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక శాంతి నగర్‌ కాలనీలో శుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక మహిళ చెత్తకుండీలోగాక రోడ్డుపై చెత్తను పారవేయడాన్ని ఆయన గమనించారు. ఆ చెత్తతోపాటు మరికొంత చెత్తను సేకరించాలని సిబ్బందికి చెప్పారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ స్వాప్నిల్ దినకర్ పుండ్కర్  ఆ మహిళ వెనక నడిచి ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె ఇంటి ఎదుట ఆ చెత్తను సిబ్బందితో వేయించారు. ఇప్పుడు మీ ఇంటి ఆవరణ శుభ్రంగా ఉన్నదా అని ప్రశ్నించారు. చెత్తను కుండీలో వేసి రోడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలంటూ గట్టిగా చీవాట్లు పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!