Share On

ప్ర‌తి ఇంటిలో ఒక ఆడ‌పిల్ల ఉండాలి.. ఆడ‌పిల్ల ఉంటేనే ఆ ఇంటికి అందం.. ఆడ‌పిల్ల ఎక్క‌డ తిరుగాడుతే అక్క‌డ ల‌క్ష్మీ దేవ‌త సంచ‌రిస్తుంద‌ని అడ‌పిల్ల‌ను అపురూపంగా చూసుకుంటారు.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఒక జంట ఆడ‌పిల్ల కోసం కొన్ని సంవ‌త్సరాలుగా ఎదురుచూస్తుంది. ఆడ‌పిల్ల పుట్టేంత‌వ‌ర‌కూ పిల్ల‌ల్ని కంటూ పోయింది. అలా ఒక‌రిద్ద‌రు కాదు ఏకంగా 14మంది కొడుకులు పుట్టారు కాని ఒక్క అమ్మాయి మాత్రం పుట్ట‌లేదు. ఇంక త‌మ‌కు ఆడ‌పిల్ల పుట్ట‌ద‌నే ఆవేద‌న‌తో చివ‌రి కాన్పుకు చూసేస‌రికి వారికి పండంటి అమ్మాయి పుట్టింది. వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మిచిగాన్ రాష్ట్రానికి చెందిన‌ జై, కేట‌రీ స్కీవాండ్ దంప‌తుల‌కు ఆడ‌పిల్ల అంటే ఎంతో ఇష్టం. ఒక కూతురు ఉంటే బాగుంటుంద‌ని చాలాసార్లు అనుకున్నారు. కానీ వారి ఆశ‌ల‌ను నీరుగాస్తూ ప్ర‌తిసారి అబ్బాయిలే జ‌న్మించారు. అలా ఈ దంపతుల సంతానం 14 మందికి చేరింది. త‌ర్వాత కేట‌రీ మ‌రోసారి గ‌ర్భం దాల్చింది. ఈసారి కూడా మ‌గ‌బిడ్డే పుడ‌తాడ‌ని అంతా అనుకున్నారు. కానీ ఊహించ‌ని విధంగా వారి జీవితాల్లో వెలుగు నింపుతూ గురువారం(న‌వంబ‌ర్ 5న‌) అమ్మాయి ప్ర‌స‌వించింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. సుమారు మూడున్న‌ర కిలోల బ‌రువుతో జ‌న్మించిన ఆ శిశువుకు మ్యాగీ జేన్ అని నామ‌క‌ర‌ణం చేసి పిలుచుకుంటున్నారు. ఈ సంవ‌త్స‌రం మాకు మ‌ర్చిపోలేనిది, మ్యాగీ మా జీవితాల్లోకి రావ‌డం అన్నింటిక‌న్నా పెద్ద గిఫ్ట్ అని కేట‌రీ చెప్పుకొచ్చారు. మా ముద్దుల చెల్లెల‌ను గుండెల మీద ఆడిస్తామంటూ 14 మంది అన్న‌లు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఆడ‌పిల్ల ఉంటే ఆ ఆనంద‌మే వేర‌ని, ఆ ఇల్లు నంద‌న‌వ‌నంగా ఉంటుంద‌ని ఆ త‌ల్లిదండ్రులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!