Share On

క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల సినిమారంగం కుదేలైపోయింది.. లాక్‌డౌన్ వ‌ల్ల మూత‌ప‌డిన సినిమాహాళ్లు దాదాపుగా ఏడు, ఎనిమిది నెల‌ల నుంచి తెరుచుకోనేలేదు. మొన్న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స‌డ‌లింపుల వ‌ల్ల సినిమా హాళ్లు తెరుచుకోవ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేశారు. కాని సినిమా హాళ్లు తెరిచిన కూడా చూడ‌డానికి ప్రేక్ష‌కులు ఎవ‌రూ అటు వైపే చూడ‌డం లేదు. క‌రోనా భ‌యం ప్రేక్ష‌కుల‌ను వెంటాడుతోంది. రాబోయే కాలం శీతాకాలం కూడా ఒక ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే థియేట‌ర్ల య‌జ‌మానులు కోలుకోని న‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా హాళ్లు ప్రారంభించినా ఎవ‌రూ రాక‌పోవ‌డంతో మూసివేశారు. ఇప్పుడు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగళూరులోనూ కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అక్టోబ‌ర్ 15 నుంచి సినిమాథేయ‌ట‌ర్ల‌ను ప్రారంభించారు. అయితే, క‌రోనా భ‌యంతో ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా రాక థియేట‌ర్ల య‌జ‌మానులకు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా పూడ‌టం లేదు. దీంతో చేసేదేమీ లేక చాలామంది సినిమాహాళ్ల‌ను మూసివేస్తున్నారు. త‌మ థియేట‌ర్‌లో 1200 సీటింగ్ కెపాసిటీ ఉంద‌ని, కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం 600 మందికి అనుమ‌తి ఉన్నా ఒక్కో షోకు 20, 25 మందికి మించి ప్రేక్ష‌కులు రావ‌డంలేద‌ని బెంగ‌ళూరులోని ఓ థియేట‌ర్ య‌జమాని చెప్పారు. ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా రాక‌పోవ‌డంవ‌ల్ల షో నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా మీద ప‌డుతున్నాయ‌ని బెంగ‌ళూరులోని థియేటర్ల య‌జ‌మానులు చెబుతున్నారు. థియేట‌ర్ల‌ను న‌డిపి న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవ‌డం కంటే సినిమా హాళ్లను మూసివేయ‌డం మంచిద‌ని బాట‌లో థియేట‌ర్ య‌జ‌మాన్యం మూసివేస్తున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!