Share On

క‌రోనా తెచ్చిన క‌ష్టాలు చెప్ప‌డానికి స‌మ‌య‌మే స‌రిపోదు.. ఎన్నో రంగాలు, ఎన్నో జీవితాలు క‌నుమ‌రుగైపోయాయి.. సినిమా రంగం మాత్రం కుదేలైపోయింది. షూటింగ్‌లు లేక ఎంతోమంది రోడ్డున ప‌డ్డారు. తిన‌డానికి తిండిలేక అల్లాడిపోయిన వారు ఉన్నారు. తండ్రి ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ సినిమాలో త‌న ఇద్ద‌రు కొడుకులే హీరోలు.. క‌రోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితి ఏలాగైనా సినిమాను పూర్తి చేయాల‌ని భావించిన అన్న‌ద‌మ్ములైనా ఆ సినిమా హీరోలు దొంగ‌త‌నానికి పాల్ప‌డి పోలీసుల‌కు చిక్కారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని చెన్నైలో జ‌రిగింది.

చెన్నై న్యూ వాషర్‌మెన్‌ పేటకు చెందిన విజయ్‌ శంకర్‌ అనే వ్యక్తి సొంతంగా ‘ నీ దాన్‌ రాజా’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అతడి కుమారులు వి.నిరంజన్‌ కుమార్‌(30), లెనిన్‌ కుమార్‌(32)లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సినిమా పూర్తి చేయాలని భావించారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం దొంగతనాలకు సిద్ధపడ్డారు. జన సంచారం తక్కువ ఉండే గ్రామాలైన చెంగల్‌పేట్‌, మాదవరం, మింజూర్‌, పొన్నెరి గ్రామాల్లో మేతకు వెళ్లిన మేకల గుంపులను లక్ష్యంగా చేసుకునేవారు.
పట్టుబడకుండా ఉండేందుకు అందులో నుంచి ఒకటి, రెండు మేకలను దొంగలించేవారు. ఈ క్రమంలో అక్టోబర్‌ 9న మాదవరం పలనిలో మేక దొంగతనం జరిగింది. మందలో 6 మేకలు ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవి వీడియోల ఆధారంగా సోదరులిద్దరూ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. వారిద్దరూ ఒక కారులో వచ్చినట్టు కనిపించగా, కారు నెంబరు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులే వేషాలు మార్చి, సాధారణ జనాల్లో కలిసిపోయి గమనించసాగారు. శనివారం రోజున ఆ సోదరులు నిద్రిస్తున్న మేకను దొంగలిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!