Share On

కొంత‌మంది వ‌య‌సు పెరుగుతున్న కొద్ది.. వారి చేసే ప‌ని మీద మాత్రం ఏ మాత్రం ఆస‌క్తి త‌గ్గ‌దు.. స‌మాజం కోసం ఎంతోకొంత ప‌నిచేయాల‌ని అనుక్ష‌ణం తపించేవారుంటారు.. మంచి ఆలోచ‌న‌, మంచి మ‌న‌సు ఒక్క శ‌రీరానికే కాని మ‌న‌సుకు కాద‌ని రుజువు చేసే వారెంతోమంది ఉంటారు. అలాంటి వ్య‌క్తే నందా స‌ర్‌. ఇప్పటికి అత‌ని వ‌య‌సు 102 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా ఎంతోమంది పిల్ల‌ల‌కు పాఠాలు చెపుతూ ఇప్ప‌టి యువ‌త‌రానికి స్పూర్తిగా నిలుస్తున్నాడు.

ఒడిశాకి చెందిన నందా పృస్టీ. ఉదయాన్నే నిద్రలేవడం, గబగబా ఇంట్లో పనులన్నీ ముగించుకుని పాఠ‌శాల‌కి వెళ్లడం, పిల్లల‌తో క‌లిసిమెలిసి ఆడుతూ, పాడుతూ చదివించడం గత 70 సంవ‌త్స‌రాలుగా నందా పృస్టీ దినచర్య ఇదే. ఒకే ఫ్యామిలీలో నాలుగు జనరేషన్స్​కి చదువు చెప్పిన ఘనత కూడా ఈయనకి ఉంది. ఒడిశాలో జైపూర్ జిల్లాలోని కాంతిరా అనే ఊళ్లో ఈ ‘ నందా సర్ ’ చాలా ఫేమస్​..ఈయన చదువు చెప్పే పద్ధతి, పిల్లలతో మెలిగే విధానం నచ్చి చుట్టు పక్కల వాళ్లంతా తమ పిల్లలకి ఈయన దగ్గరే చదువు చెప్పిస్తున్నారు. స్కూల్‌లో అడుగుపెడితే చాలు చిన్న పిల్లాడు అయిపోతాడట నందా. వాళ్లతో టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదంటున్నాడు. పిల్ల‌లు చదువుపై అశ్రద్ధ చేసినా, క్రమశిక్షణ తప్పినా పిల్లల్ని గట్టిగానే మందలిస్తా అంటున్నాడు. 70 ఏళ్లుగా ఈ వృత్తిలోనే ఉన్నాను. పదిమందికి చదువు చెప్పడంలో తెలియని సంతోషం దాగుంది. త‌న విద్యార్థి ఎవ‌రూ కనిపించి పలానా ఉద్యోగం చేస్తున్నా సర్ అని చెప్తే అప్పుడు కలిగే సంతోషం కొన్ని కోట్లు పెట్టినా కొనలేమ‌ని గ‌ర్వంగా చెపుతాడు . బతికున్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటాన‌ని, వీలైనంత ఎక్కువ మంది పేద పిల్లలకి చదువు చెప్పడమే నా లక్ష్యం అంటున్నాడు ఈ అలుపెర‌గ‌ని ఉపాధ్యాయుడు. అంతేకాదు కరోనా టైంలో కూడా ఆపకుండా ఆన్‌లైన్ క్లాస్​లు చెపుతూ త‌న స‌మ‌యాన్నివిద్యార్థుల‌కే కేటాయించారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!