Share On

మ‌నిషి ఆలోచ‌న‌లు.. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌న రోజురోజుకు ఏలా మారుతుందో అర్ధ‌మే కావ‌డం లేదు.. బంధాలు, ర‌క్త‌సంబంధాలు అన్ని స్వార్థం కోస‌మే వాడుకుంటున్నారా అనిపిస్తోంది. ప‌రాయి సుఖం కోసం అడ్డుగా ఉన్నాడ‌ని క‌న్న‌కొడుకుని చంపుకునే స్థాయికి దిగ‌జారిపోతున్నాయి మ‌న విలువ‌లు. నిజామాబాద్ జిల్లాలో జ‌రిగిన ఒక దారుణ సంఘ‌ట‌న చూస్తే అస‌లు మ‌నం ఏటు ప‌య‌నిస్తున్నామో అర్థమే కావ‌డం లేదు. ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన నవ్యకు తాళ్లరాంపూర్‌కు చెందిన అభిషేక్‌కి ఐదు సంవ‌త్స‌రాల క్రితం పెళ్లి జ‌రిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల నాగేంద్ర అనే కొడుకు ఉన్నాడు. అయితే నవ్యకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధముంది. పెళ్లి తర్వాత విషయం తెలియడంతో నవ్య, అభిషేక్ తరచుగా గొడవలు పడుతుండేవారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి విడివిడిగా ఉంటున్నారు. నవ్య ప్రస్తుతం కొడుకుతో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. అయితే తన సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన నవ్య, గురువారం రాత్రి నాగేంద్రను గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లుగా పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నవ్యను తమదైన శైలిలో విచారించగా తానే చంపినట్లు ఒప్పుకుంది. బాలుడి మృతదేహాన్ని అభిషేక్ కుటుంబసభ్యులు తాళ్లరాంపూర్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అక్రమ సంబంధానికి అలవాటుపడిన నవ్య, తన కాపురాన్ని పాడుచేసుకోవడంతో పాటు సొంత కొడుకుని కూడా చంపుకుందని గ్రామస్తులు అంటున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!