Share On

త‌మిళ హీరో విజ‌య్ హీరోగా న‌టించిన మాస్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి ప్ర‌తినాయకుడిగా న‌టిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా టీజ‌ర్‌ను అభిమానుల‌కు ఊహించ‌ని గిప్ట్‌ను అందించారు. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈచిత్రం కోసం తమిళ సినీ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ‘నాకు తెలుసు సర్‌.. జేడీ ఒక నేరస్థుడు. అయినా.. ఒక సాధారణ అధ్యాపకుడు ఇంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఎందుకు మారాడు..?’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమవుతుంది. ఈ టీజర్‌లో హీరో విజయ్‌ ఒక స్టైలిష్‌, పవర్‌ఫుల్‌ ప్రొఫెసర్‌గా కనిపించాడు. విలన్లను తరిమికొడుతున్న కొన్ని ఫైటింగ్‌ సన్నివేశాలను కూడా టీజర్‌లో చూపించారు. విడుదలైన టీజర్‌ సైతం అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ సరసన మాలవిక కథానాయికగా కనిపించనుంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకులు. అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల కానుంది


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!