Share On

రోజురోజుకు బంధాలు, బంధుత్వాలు క‌నుమ‌రుగ‌వుతున్నాయి.. తోడ‌బుట్టిన వారే ప‌రాయివాడిలా చూస్తే ప‌ట్టించుకోవ‌డం లేదు.. డ‌బ్బుతో, స్వార్ధంతో నిండిపోతున్న సమాజం మ‌న‌ది.. లక్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్న కాని క‌న్న‌త‌ల్లిదండ్రుల‌ను రోడ్డుపైన వ‌దిలేసిన వారు ఉన్నారు. ఆనాధాశ్ర‌మానికి అప్ప‌గించేవారు ఉన్నారు. కాని ఒక వ్య‌క్తి త‌న తండ్రి మ‌ర‌ణించినా దేవుడిలా కొలుస్తూ ఆయ‌న‌కు ఆల‌యాన్ని క‌ట్టించి, విగ్ర‌హం స్థాపించి పూజలు చేస్తూ దానిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

విశాఖ‌ప‌ట్నం ఎంవిపి కాల‌నీకి చెందిన వి. దాసు రాష్ట్ర ఆర్మీ రిజర్వ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. దాసు తండ్రి వాసుపల్లి దేముడు గుండెపోటులో కన్నుమూశారు. తన తండ్రిని ఎంతగానో ప్రేమించే దాసు తండ్రికి ఆలయాన్ని కట్టి నిత్యం పూజలు చేస్తూ స్మరించుకుంటున్నారు. తండ్రి విగ్రహాన్ని పెట్టేందుకు తన తోబుట్టువులు ప్రోత్సహించారని దాస్‌ పేర్కొంటున్నారు. తన తండ్రి ప్రదేళ్ల వయసప్పుడే అనాథగా మారి మత్స్యకారుడిగా జీవితం నెట్టుకొచ్చారని దాస్‌ తెలిపారు. ఏడుగురి సంతానాన్ని పెంచి ప్రయోజకులను చేశారని స్మరించుకుంటున్నారు. ఆయన చేసిన త్యాగాలు, పంచిన ప్రేమకు ప్రతిరూపంగా ఆయనకు గుడి కట్టినట్లు పేర్కొన్నారు. చిన్నతనంలో తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకున్నారో వాళ్లు వృద్ధాప్యంలోకి వచ్చాక మనం కూడా వారిని అలాగే చూడాలని విశాఖ‌ప‌ట్నం న‌గ‌రానికి చెందిన ఎంవిపీ కాల‌నీకి చెంది దాస్‌ అంటున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!