Share On

అమ్మ‌, నాన్న‌చ‌నిపోయిన త‌న మేన‌కోడ‌లుకు మేన‌మామే అన్నీ తానై చూసుకుంటున్నాడు.. అ అమ్మాయికి ఏలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు. ఆన్‌లైన్ చ‌దువుకోస‌మ‌ని ఒక తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ మొబైల్ షోరూంకు వెళ్లి 14వేల ధర కలిగిన స్మార్ట్‌ఫోన్, 12వ తరగతి చదువుతున్న తన మేనకోడలికి కొర‌కు కొనుగోలు చేశాడు. తన సోదరి నెల రోజుల క్రితం చనిపోవడంతో మేనకోడలికి భీమ్ సింగే అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఫోన్ కొనిచ్చిన కొన్ని రోజులకే ఆ స్మార్ట్‌ఫోన్ బాగా వెడెక్క‌డం, హ్యాంగ్ అవడం లాంటి సమస్యలు తలెత్తడంతో, అతని మేనకోడలు ఈ విషయాన్ని భీమ్ సింగ్‌కు చెప్పింది.

ఢిల్లీలోని ప్ర‌హ్ల‌ద్‌పూర్‌లోని మొబైల్ షాపులో మొబైల్ కోనుగోలు చేశారు. నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఇలాంటి సమస్య రావడంతో ఆ ఫోన్‌ను ఢిల్లీలోని రోహిణిలో ఉన్న ఎం2కె మాల్‌కు వెళ్లి ఆ మొబైల్ కంపెనీ సర్వీస్ సెంటర్‌లో చూపించి, కొత్త స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలని భీమ్ సింగ్ సర్వీస్ సెంటర్ వారిని కోరాడు. అది తమ పాలసీకి విరుద్ధమని, కొత్త ఫోన్ ఇవ్వడం కుదరదని మొబైల్ కంపెనీ సర్వీస్ సెంటర్ వారు తేల్చి చెప్పారు. ఇక లాభం లేదనుకుని భావించిన భీమ్ సింగ్ ఒక‌ ఖాళీ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లి తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని సర్వీస్ సెంటర్ వాళ్లను నిలదీశాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో మాల్‌లోనే సర్వీస్ సెంటర్ ఎదుటే మీద పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. భీమ్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 శాతం కాలిన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని రోహిణి డీసీపీ పీకే మిశ్రా తెలిపారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!