Share On

క‌రోనా భ‌యంతో ప్ర‌భుత్వాలు విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి. ఒక్క‌టికానున్న వేలాది పెళ్లి జంట‌లు ఆగిపోయాయి. కార్తీక‌మాసం ప్రారంభంతో రెండు తెలుగు రాష్ట్రాల‌లో పెళ్లిళ్ల‌ సందడి మొదలైంది. గత మార్చి నుంచి కరోనా భయం, లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల అంతంతమాత్రంగానే జరిగిన శుభకార్యాలు మ‌రింత‌ పుంజుకోనున్నాయి. కరోనా భయం కాస్త తగ్గడం, వచ్చే నెలరోజుల దాకా శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లి సందడి మొదలైంది. జనవరి 6 దాకా కూడా పెళ్లి ముహూర్తాలున్నట్లు పురోహితులు చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కార్తికమాసంలో పెళ్లిళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చే నెలరోజుల్లో చేయలేకపోతే తర్వాత దాదాపు మరో 6 నెలలు, అంటే మే 12న వైశాఖం మొదలయ్యేదాకా మంచి ముహూర్తాలుండవని కొందరు ఇప్పుడే శుభకార్యాలు పెట్టుకుంటున్నారు. మార్చి నుంచి సెప్టెంబరు దాకా పెళ్లి సంబంధాల కోసం సంప్రదించినవారు పెద్దగా లేరని, గత నెల నుంచి పెళ్లి సంబంధాలు భారీగా పెరుగుతున్నాయ‌ని పురోహితులు అంటున్నారు. కొంతమంది ఈ కార్తికంలో పెళ్లిళ్లకు సిద్ధపడుతుండగా మరికొందరు ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించుకుని మేలో ముహూర్తాలు పెట్టుకోవాలని భావిస్తున్నారు. క‌రోనా భ‌యం త‌గ్గుతున్న కొద్ది పెళ్లిళ్లు సంద‌డి పెరుగుతోంద‌ని మండ‌పాల నిర్వాహ‌కులు సైతం అంటున్నారు. దాదాపుగా ఏడెనిమిది నెల‌లు పెళ్లిళ్ల హంగామా లేకుండా బోసిపోయిన వాతావ‌ర‌ణం మ‌ళ్లీ పెళ్లిళ్ల‌తో వెడెక్కుతోంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!