Share On

ఇద్ద‌రూ క‌లిసే ప్ర‌యాణం చేస్తారు.. లారీ తీసుకొని ఎన్నో రాష్ట్రాలు తిరుగుతుంటారు. డ్రైవ‌ర్ మీద న‌మ్మ‌కంతో క్లీన‌ర్‌, క్లీన‌ర్ మీద ప్రేమ‌తో డ్రైవ‌ర్ ఎన్నో వేల కిలోమీట‌ర్ల ప్ర‌యాణం చేస్తూ ఉంటారు. కాని ఆ న‌మ్మ‌కం, ఆ ప్రేమ విక‌టిస్తే చాలు, గొడ‌వ‌లు జ‌రుగుతాయి, క్ష‌ణాల్లో ప్రాణాలు పోతాయి. లారీ, డ్రైవ‌ర్ల మ‌ధ్య జ‌రిగిన ఒక చిన్న సంఘ‌ట‌న చిలికి చిలికి పెద్ద గొడ‌వ‌గా మారి ప్రాణం పోయింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కాకినాడకు చెందిన లారీ డ్రైవర్‌ పోలోతు నైపురాజు, తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడకు చెందిన క్లీనర్‌ రాజుతో కలిసి కాకినాడ నుంచి పామాయిల్‌ లోడుతో మంథని వెళ్లాడు. అక్కడ సరుకు అన్‌లోడ్‌ అయిన తర్వాత శనివారం కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ వెళ్లి నూకలు లోడ్‌ చేసుకుని కాకినాడ బయలుదేరారు. కరీంనగర్‌ వచ్చేసరికి లారీకి పైన కట్టిన టార్పాలిన్‌ తాళ్లు లూజు కావడంతో బిగించాలని డ్రైవర్‌ సూచించగా క్లీనర్‌ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. క్లీనర్‌ కత్తితో డ్రైవర్‌పై దాడి చేయబోయాడు. వెంటనే డ్రైవర్‌ నైపురాజు చాకుతో ఎదురుదాడి చేసి క్లీనర్‌ పొట్ట చీల్చి వేశాడు. శవాన్ని క్యాబిన్‌లోనే వేసుకుని 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కొణిజర్ల పొలీస్‌స్టేషన్‌ ఎదుట లారీ నిలిపేసి పోలీసులకు లొంగిపోయాడు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!