Share On

బ‌హిరంగ ప్ర‌దేశంలో, మ‌నుషులు నివ‌సించే ప్ర‌దేశంలో మూత్ర విస‌ర్జ‌న చేశాడ‌ని ఆ ప్రాంతానికి చెందిన కొంద‌రు వ్య‌క్తులు మూత్ర విస‌ర్జ‌న చేసిన సుహెయిల్ అనే యువకుడిని తీవ్రంగా కొట్టి చంపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బ‌హ్రెయిక్ జిల్లా ఖైరి డుకోలి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. ఆదివారం రాత్రి సుహెయిల్ అనే యువ‌కుడు ఖైరి డుకోలి గ్రామం మీదుగా వెళ్తూ ఒకచోట మూత్ర‌విస‌ర్జ‌న చేశాడు. ఇది గ‌మ‌నించిన రామ్ మూర‌త్ అనే మ‌రో యువకుడు త‌మ ఇండ్ల ముందు ఎందుకు మూత్ర విస‌ర్జ‌న చేశావంటూ నిల‌దీశాడు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ఈ గొడ‌వ మరింత పెద్ద‌ది కావ‌డంతో ఇరుగ‌పొరుగు అక్క‌డికి చేరుకున్నారు. రామ్‌మూర‌త్‌తోపాటు ఆత్మారామ్‌, రాంపాల్‌, స‌నేహి, మంజీత్ అనే యువ‌కులు కలిసి సుహెయిల్‌ను తీవ్రంగా కొట్టారు. క‌ర్ర‌ల‌తో కొట్ట‌డంతో అత‌ను ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి చింతారామ్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!