Share On

ఎప్పుడొప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిప‌ల్ ఎన్నిక‌ల గంట మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి షెడ్యూల్‌ విడుదల చేశారు. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయ‌ని, బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరుగనుండగా.. అసరమైతే డిసెంబర్‌ 3న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. 4వ తేదీన ఓట్లు లెక్కింపు నిర్వహించి, ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించినట్లు ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి చెప్పారు. రెండు వార్డులు ఎస్టీలు, 10 వార్డులు ఎస్సీలకు, 50 బీసీలకు, జనరల్‌ మహిళ 44, మరో 44 స్థానాలు జనరల్‌కు రిజర్వు చేసినట్లు వివరించారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!