Share On

ఎవ‌రూ ఊహించ‌లేదు.. నోటిఫికేష‌న్ ఇచ్చిన రోజు నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ మొద‌లెట్ట‌డం, ప‌ది, ప‌దిహేను రోజుల్లో ఎన్నిక‌ల తంతే ముగిసేలా గ్రేట‌ర్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. మాకు ఎదురే లేదు, మాదే గెలుపని ప్ర‌తిక్ష‌ణం, స‌భ‌లు, స‌మావేశాల్లో గొప్ప‌గా చెపుతున్న అధికార పార్టీ నాయ‌క‌త్వం జిహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌పై ఎందుకింత తొంద‌ర ప‌డింద‌నేదీ అర్థం కావ‌డం లేదు. రోజురోజుకు త‌న ఉనికిని చాటుకుంటూ బ‌లాన్ని పెంచుకుంటున్న బిజెపి, ఇత‌ర పార్టీల‌కు అవ‌కాశం ఇవ్వొద్ద‌నే ఆలోచ‌న‌తోనే అధికార పార్టీ ఎవ‌రూ ఊహించ‌కుండా ముంద‌డుగు వేసార‌ని అర్థ‌మ‌వుతోంది. రోజులు మారుతున్న కొద్ది అధికార పార్టీకి న‌ల్లేరుపై న‌డ‌క‌లా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంటుంద‌నే భావించే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అభ్య‌ర్థ‌లను ఎంపిక చేసే అవ‌కాశం ఇవ్వ‌కుండా అధికార పార్టీ షాక్ ఇచ్చిన‌ట్లుగానే తెలుస్తోంది. గ్రేట‌ర్‌లో త‌మ సత్తా చాటుతామ‌ని చెపుతున్న బిజెపి అభ్య‌ర్థుల‌ ఎంపిక‌, ప్ర‌చార బాధ్య‌త‌లపై ఎలాంటి ప్రణాళిక‌లు రూపొందిస్తుందో, ఇంత త‌క్కువ స‌మ‌యంలో త‌మ స‌త్తా చాటుతుందో లేదో అర్థం కావ‌డం లేదు.

అధికార పార్టీలో మార్పే ప్ర‌ధాన కార‌ణ‌మా..

తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎదురే లేదు. ఇంకా కొన్ని సంవ‌త్స‌రాలు తెలంగాణ గ‌డ్డ‌మీద గులాబీ జెండా ఎగురుతోంద‌ని భావించినా టిఆర్ఎస్‌లో దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఏదో మార్పు క‌న‌బ‌డుతున్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే యువ‌త‌లో ఒక ర‌క‌మైనా వ్య‌తిరేక‌త ఉంది. బంగారు తెలంగాణ ఏర్ప‌డిన నాటినుంచి ఇప్ప‌టివ‌ర‌కు నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవు. ఇటీవ‌ల భాగ్య‌న‌గ‌రంలో విప‌రీతంగా కురిసిన వ‌ర్షాల‌కు కూడా స‌రియైన స‌మ‌యంలో అధికార పార్టీ నాయ‌కులు స్పందించ లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతుంద‌ని, ప్ర‌తిప‌క్షపార్టీలు అధికార పార్టీ వ్య‌తిరేక‌త‌ను అవ‌కాశంగా మార్చుకోకుండా ఉండేందుకే ఎవ‌రూ అనుకొని రీతిలో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లుగానే తెలుస్తోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంటుంద‌ని నిధానంగా ప్రచారం చేస్తూ గెలుపుపై ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌నుకునే వారికి మాత్రం ఇప్పుడు అవ‌కాశ‌మే లేదు. మాట‌ల‌, తూటాల‌తో, ప్ర‌చారంలో దూసుకుపోదామ‌నుకున్న అభ్య‌ర్థుల ఈ కొద్ది స‌మ‌యాన్ని ఏలా స‌ద్వినియోగం చేసుకుంటారో అర్థం కావ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫ‌లిత‌మే తొంద‌ర‌గా గ్రేట‌ర్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ప్ర‌ధాన కార‌ణం కావ‌చ్చ‌నే ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ఉన్న అతి త‌క్కువ స‌మ‌యాన్ని అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ గెలుపుకోసం ఏలా మ‌లుచుకుంటాయో అనేది అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ప్ర‌తి క్ష‌ణం అన్ని పార్టీల‌కు అత్యంత‌ విలువైన‌ది. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా ప్ర‌చారాన్ని కింది స్థాయి వ‌ర‌కు తీసుకెళ్లిగ‌లిగే వారికే గెలుపు అవ‌కాశాలు ద‌క్కే అవ‌కాశం ఉంటుంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!