Share On

ఇంట‌ర్‌నెట్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని శాసిస్తూ, అతి వేగంగా దూసుకుపోతుంది. చేతిలో మొబైల్ లేకుండా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. స్మార్ట్‌ఫోన్ మ‌నిషి జీవితంలో అత్యంత ప్ర‌ధాన వ‌స్తువుగా మారిపోయింది. మ‌న‌దేశంలో ఈ సంవ‌త్స‌రం ఆగ‌స్టు చివ‌రి నాటికి 75కోట్ల ఇంట‌ర్‌నెట్ క‌నెక్ష‌న్ల మైలురాయిని దాటేసింది. నాలుగు సంవ‌త్స‌రాల‌లోనే అత్యంత వేగంగా క‌నెక్షన్ల సంఖ్య పెరిగిపోయింది. 75 కోట్ల ఇంటర్‌‌నెట్‌‌ కనెక్షన్‌‌లలో ఎక్కువ భాగం అర్బన్ ప్రాంతాల‌లోనే ఉన్నాయి. వైర్‌‌లెస్‌‌ డివైస్‌‌లు, మొబైల్‌‌ ఫోన్‌‌లు, డాంగిల్స్‌‌ను పట్టణాలు, సిటీలలోనే ఎక్కువగా వాడుతున్నారు. ట్రాయ్‌‌ డేటా ప్రకారం జూన్‌‌ 2020 నాటికి మొత్తం 74.9 కోట్ల ఇంటర్‌‌నెట్‌‌ యూజర్లున్నారు. ఆగ‌స్టు చివరి నాటికి యూజర్ల సంఖ్య 76.7 కోట్లను దాటేసింది. సెప్టెంబర్‌‌ 2018లో ఇండియాలో ఇంటర్‌‌నెట్‌‌ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అందుకుంది. ఆ తర్వాత ప్రతి నెలా చూస్తే సుమారు 86 లక్షల కొత్త కనెక్షన్‌‌లు తీసుకుంటున్నార‌ని ట్రాయ్ తెలిపింది.

  కర్నాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌‌, తెలంగాణ, గుజరాత్‌‌, మహారాష్ట్ర ఈ ఆరు రాష్ట్రాలలోనూ కలిపి 26 కోట్ల ఇంటర్‌‌ నెట్‌‌ కనెక్షన్‌‌లు (35 శాతం) ఉన్నాయి. జూన్‌‌ చివరి నాటి డేటా ప్రకారం రిలయన్స్‌‌ జియో ఎక్కువ మార్కెట్‌‌ వాటాతో  మొదటి ప్లేస్‌‌లో నిలుస్తుండగా, ఆ తర్వాత ప్లేస్‌‌లలో ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌లు ఉన్నాయి. దేశంలో ఇంటర్‌‌నెట్‌‌ కనెక్షన్‌‌ల సంఖ్య 75 కోట్లు దాటినంత మాత్రాన, అన్ని కోట్ల మంది ప్రజలకు ఇంటర్‌‌నెట్‌‌ కనెక్షన్‌‌లు ఉన్నాయని చెప్పలేం.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!