Share On

బాలిక స్నేహితుల‌తో ఆడుకొంది.. ఎక్క‌డెక్క‌డ ఏలాంటి ఆట ఆడారో తెలియ‌దు.. ఆ ఆట‌లో బాలిక కాలికి ఉన్న కాలిప‌ట్టీ పొగొట్టుకుంది. కాలిప‌ట్టి ఎక్క‌డ పొగొట్టుకున్నావ‌ని ఆ బాలిక త‌ల్లి బాలిక‌ను తిట్ట‌డంతో మ‌న‌స్థాపానికి గురై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న గుంటూరు జిల్లాలో జ‌రిగింది. సత్తెనపల్లి పరిధిలోని ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన బాలిక(9) ఆడుకుంటూ తన కాలి ప‌ట్టీ పోగొట్టుకుంది. అది ఆమె తల్లికి తెలియడంతో పట్టీ పోగొట్టినందుకు బాలికని తీవ్రంగా మందలించింది. అమ్మ తిట్టిందని తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక టమాటాలో ఎలుకల మందు పెట్టుకుని తినేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుప‌త్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె వారం రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. బాలిక ఆసుప‌త్రిలో మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!