Share On

ఈ నెల‌లో జ‌ర‌గ‌బోయే తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌కు హ‌జ‌ర‌య్యే వారంద‌రూ ముందుగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకొవాల‌ని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. 12 రోజుల పాటు జ‌ర‌గ‌బోయే పుష్క‌రాలు ఉద‌యం 6గంట‌ల నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపింది. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు రావొద్ద‌ని సూచించింది. క‌రోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన వారికే పుష్క‌ర‌ఘాట్ల‌లోకి అనుమ‌తించ‌నున్నారు. క‌రోనా రిపోర్టు లేకుండా వ‌చ్చే వారికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌ అనంత‌రం అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వారికి పుష్క‌ర‌ఘాట్ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌నున్నారు. పుష్క‌ర‌ఘాట్లు, ఆల‌య ప్ర‌వేశ ద్వారాల వ‌ద్ద శానిటైజ‌ర్లు, థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచ‌నున్నారు. మాస్కు ధ‌రించ‌డం, ఆరు అడుగుల భౌతిక దూరం త‌ప్ప‌నిస‌రి చేసింది. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పుష్క‌ర స్నానాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. పుష్కారాలకు పకబ్బందీగా ఏర్పాటు చేశాయని అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.5 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ నిధులతో పుష్కరఘాట్ల వద్ద మౌలిక వసతులతోపాటు, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, భక్తులు నిబంధనలు పాటిస్తూ పూజలు, పిండ ప్రదానాలు చేసుకోవాలని కోరారు. సమీక్షలో దేవదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!