Share On

ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల భాగ్య‌న‌గ‌రంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ప్ర‌భుత్వ స‌హాయం అంద‌డం లేద‌ని ఎంతోమంది అధికారుల కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. ఒకేసారి ప‌దుల సంఖ్య‌లో జ‌నం గుమిగూడ‌టంతో పాటు కిలో మీట‌ర్ల దూరం బారులు తీరారు. బారులు తీరిన క్యూ ఒత్తిడికి జ‌నం అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం గంటల పాటు నిల్చోవడంతో ఒక‌ మహిళ చనిపోయింది. ఈ ఘటన గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ-సేవ కేంద్రం వద్ద జరిగింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం 50 ఏళ్ల మున్నవర్ ఉనిస అనే మహిళ సుమారు 3 గంటల పాటు లైన్‌‌లో నిలబడి ఒక్కసారి కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మున్నవర్‌‌ను పరిశీలించిన డాక్టర్లు ఆమె చనిపోయిందని తెలిపారు. మృతురాలిని హకీంపేట్ కుంట వాసిగా పోలీసులు నిర్థారించారు. హైదరాబాద్ వరద బాధితులు ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని మీ-సేవ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడం, కొన్ని చోట్ల సర్వర్ డౌన్, మరికొన్ని చోట్ల బంద్ ఉండడంతో నగర శివారులోని 40 కిలోమీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వెళ్లి ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!