Share On

చిన్న‌ప్పటి నుంచి ఇద్ద‌రూ యువ‌తులు మంచి స్నేహితులు.. ఒక‌రంటే ఒక‌రికి విడ‌దీయలేనంత ప్రేమ‌. ఒక‌రిని విడిచి మ‌రొకరు అస్స‌లు ఉండ‌లేరు. ఏ ప‌ని చేసినా, ఎక్క‌డికి వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే ఉండేవారు, క‌లిసి ప‌నిచేసేవారు. అలాంటిది అందులో ఒక యువ‌తికి పెళ్లి కుద‌ర‌డంతో, ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేమ‌ని, వేరువేరుగా బ‌త‌క‌లేమ‌నే భ‌యంతో ఆ యువ‌తులు ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌లోని కోల్లాం జిల్లాలో జ‌రిగింది.. ఒకే జిల్లాకు చెందిన ఆర్య అశోక్ మరియు అమృతా అనీల్ అనే 21 ఏళ్ళ కాలేజీ విద్యార్థులు ప్రాణ స్నేహితులు. అయితే అమృత కుటుంబం ఈ మద్యే ఆమెకు పెళ్లి నిశ్చయించింది. దాంతో పెళ్లైతే ఒకరికొకరు దూరమవుతారనే ఆందోళన ఇద్దరిలోనూ మొదలైంది. ఆ ఎడబాటును భరించడం కన్నా చావడమే మేలని నిర్ణయించుకున్నారు.

వీరిద్దరూ తమ డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కాలేజీకి వెళ్తున్నామని చెప్పి శనివారం కొట్టాయం బయలుదేరి, సాయంత్రమైనా ఇద్ద‌రూ ఇంటికి రాలేదు. దాంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికి చాదయమంగళం పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం వైకోమ్ జిల్లాలోని ముట్టంజాపుళా నదిలో ఇద్దరు యువతుల మృతదేహాలను స్థానిక పోలీసులు గుర్తించారు. పోలీసులు వారి కుటుంబసభ్యలకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి వచ్చి మృతదేహాలను గుర్తించారు. యువతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!