Share On

ఉద్యోగం అందరూ చేస్తారు. కాని చేస్తున్న ఉద్యోగాన్ని ఒక ఛాలెంజ్ గా స్వీకరిస్తూ, కొద్దిమందికైనా సహాయ, సహాకారాలతో పాటు, వారికి కావాల్సిన సమయంలో న్యాయాన్ని అందిస్తే చాలు. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలాంటి ఉద్యోగులు కొద్దిమందే ఉంటారు..

ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చేసే ప్రతిభను బట్టి మంచి పేరుతో పాటు, తొందరగా పదోన్నతులు లభిస్తాయి. ఢిల్లీకి చెందిన ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్‌‌ సీమా ధాకా అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. 76 మంది పిల్లలను వారి కుటుంబాలకు సురక్షితంగా అందించిన ఢిల్లీ పోలీస్ మహిళా హెడ్ కానిస్టేబుల్‌‌ సీమా ధాకాకు పదోన్నతి లభించింది . తప్పిపోయిన పిల్లలను వారి ఇళ్లకు చేర్చడంలో కృషి చేసినందుకు గాను సీమాకు ఇంటెన్సివ్ స్కీమ్‌‌లో ప్రమోషన్ ఇచ్చారు. ఇలా ప్రమోషన్ అందుకున్న తొలి పోలీస్ ఆఫీసర్ సీమానే కావడం గర్వకారణంగా చెప్పవచ్చు.

ఢిల్లీతోపాటు పంజాబ్, బెంగాల్ లాంటి పలు రాష్ట్రాలకు చెందిన తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకోవడంలో సీమా చాలా శ్రమించింది. ఆమె పట్టుకున్న 76 మంది పిల్లల్లో 56 మంది చిన్నారుల వయస్సు 14 ఏళ్ల లోపు వారే. ఇంత మంది పిల్లల ఆచూకిని రెండున్నర నెలల వ్యవధిలో కనుగొనడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎవరైనా కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 50 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల ఆచూకీ కనుగొంటే వారిని డైరెక్ట్ ప్రమోషన్‌‌ కిందకు పరిగణిస్తామని ఢిల్లీ పోలీసు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!