Share On

క‌ర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి న్యూక్లియస్ జూనియర్ కళాశాల యాజమాన్యం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కళాశాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా నీట్,ఎంసెట్,లాంగ్ టర్మ్,షార్ట్ టర్మ్ పేరుతో 75 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తూ కేవలం ధనార్జనే ధ్యేయంగా ప‌నిచేస్తుంది. మౌలిక సదుపాయాలు పాటించకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతున్న నంద్యాల న్యూక్లియస్ జూనియర్ కళాశాలను వెంటనే సీజ్ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బిసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువ‌జ‌న సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ రియాజ్ త‌హ‌శీల్దార్ ర‌వికుమార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. వారు మాట్లాడుతూ గతంలో కూడా కరోనా సమయంలో విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులను కట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తిరిగి ఫీజులు చెల్లించాలని చెప్పినా క‌ళాశాల‌ యాజమాన్యం విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తుంద‌న్నారని వారు ఆరోపించారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!