Share On

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వీర‌విహారం చేస్తోంది. ప‌లు దేశాల్లో వైర‌స్ ప్ర‌భావానికి వ‌ణికిపోతున్నాయి. చిన్నా, పెద్దా, ముస‌లి, ముత‌కా అనే సంబంధం లేకుండా అంద‌రికి క‌రోనా త‌న ప్ర‌భావాన్ని చూపుతోంది. క‌రోనా సంక్ర‌మ‌ణ‌పై యునిసెఫ్ ఒక కొత్త నివేదిక‌ను విడుద‌ల చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావిత కేసుల్లో ప్ర‌తి 9మంది చిన్నారుల్లో ఒక చిన్నారికి క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి చెందిన యునిసెఫ్ వెల్ల‌డించింది. క‌రోనా మ‌హామ్మారి వ‌ల్ల చిన్నారుల విద్యా, ఆహార అల‌వాట్లు, స్వ‌స్థ‌త దెబ్బ‌తింటున్న‌ట్లు ఆ నివేదిక‌లో తెలిపింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల యువ‌త చాలా త‌క్కువ సంఖ్య‌లో ప్ర‌భావానికి లోన‌వుతున్నార‌ని, కోవిడ్ సోకిన చిన్నారుల్లో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉంటున్నాయ‌ని యునిసెఫ్ తెలిపింది. అవ‌ర్టింగ్ ఏ లాస్ట్ కోవిడ్ జ‌న‌రేష‌న్ అన్న టైటిల్‌తో యునిసెఫ్ త‌న నివేదిక‌ను రిలీజ్ చేసింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప్రారంభ‌మై రెండు సంవ‌త్స‌రాల‌వుతున్న‌నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల చిన్నారుల్లో క‌లిగే ప‌రిణామాల గురించి ఆ రిపోర్ట్‌లో చెప్పారు. చిన్నారుల్లో ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగానే ఉన్నా కేసుల సంఖ్య మాత్రం గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ట్లు నివేదిక తెలిపింది. చిన్నారుల‌కు కోవిడ్ సోక‌ద‌న్న ఒక‌ అపోహ ఉండేద‌ని, కానీ వాస్త‌వాలు మ‌రోలా ఉన్నాయ‌ని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ హెన్రిటా ఫోర్ తెలిపారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!