Share On

సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉంటే చాలు.. అసాధ్యాన్నిసైతం సుసాధ్యంగా మ‌లుచుకుంటారు.. ఒక యువ‌తి కేవ‌లం మూడు అంటే మూడు రోజుల్లోనే ఎవ‌రూ ఊహించ‌ని రికార్డు సాధించింది.. యూఏఈకి చెందిన ఆ యువ‌తి అతి త‌క్కువ సమ‌యంలోనే ప్ర‌పంచాన్ని చుట్టేసి రికార్డును త‌న ఖాతాలో జ‌మ‌చేసుకుంది.

యూఏఈకి చెందిన డాక్టర్ ఖవ్లా అల్ రోమైతి కేవలం మూడు రోజుల్లోనే ఏడు ఖండాలు చుట్టేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం దగ్గర రోమైతి తన యాత్రను ముగించింది. కేవలం మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల, 48 సెకన్లలో ప్రపంచం మొత్తం తిరిగేసింది. తన ప్రయాణంలో 208 దేశాలను సందర్శించింది. అయితే కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రారంభంతో ఆమె పర్యటన ఆగిపోయినట్టుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు తమ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. ప్రపంచ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రోమైతి తెలిపారు. ఇది తనకు దక్కిన గౌరవం అని గ‌ర్వంగా చెప్పింది. ప్రతి ఒక్కరు తమ జీవితంలోని లక్ష్యాలను సాధించడానికి మార్గాన్ని వెతుక్కోవాలని, సాధించాల‌ని అనుకుంటే ఏది అసాధ్యం కాదని తెలిపింది. దాదాపు 200 దేశాలకు చెందినవారు యూఏఈలో నివసిస్తున్నారు. అందుకే నేను వారి దేశాలను సందర్శించి, వారి సంస్కృతులను తెలుసుకోవాలని అనుకున్నానని రోమైతి తెలిపారు. నిరంత‌రం విమాన ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చింద‌ని, ఒక్కో స‌మ‌యంలో త‌న ప్ర‌యాణాన్ని మ‌ధ్య‌లోనే వ‌దిలిపెడ‌తాన‌ని అనుకున్నాన‌ని కాక‌పోతే త‌న స్నేహితులు, కుటుంబ‌స‌భ్యుల స‌హాకారంతో ఈ ఘ‌న‌త సాధించాన‌ని తెలిపింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!