Share On

వారు ఆ రంగంలోనే ఎంత నిష్ణాతులో వారు చేసిన దొంగత‌న‌మే చెపుతోంది. కేవ‌లం ప‌ది అంటే ప‌ది నిమిషాల్లోనే 12కోట్ల విలువైన బంగారాన్ని దొచుకెళ్లిపోయారు. మాస్కులు, హెల్మెట్లు ధ‌రించిన న‌లుగురు దొంగ‌లు చేసిన దొపిడి రాష్ట్రాన్ని వణికించింది. ఒడిశా కటక్ పట్టణంలోని ప్రముఖ బ్యాంకింగ్ రహిత ఫైనాన్స్ సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ శాఖ నుంచి రూ .12 కోట్ల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. నాయసారక్‌లోని ఐఐఎఫ్ఎల్ బ్రాంచ్‌కి వచ్చి సెక్యూరిటీ గార్డును గన్‌తో బెదిరించి బ్రాంచ్ లోపలికి ప్రవేశించారని పోలీసు అధికారులు తెలిపారు. హిందీ మరియు ఒడియాలో మాట్లాడిన దుండగులు బ్రాంచ్ మేనేజర్‌ను మరియు ఇతర సిబ్బందిని టాయిలెట్‌లో బంధించి లాకర్ తాళాల‌ను లాక్కొని ఈ భారీ దోపిడి చేశారని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కటక్ పోలీసు డిప్యూటీ కమిషనర్ ప్రతీక్ సింగ్ తెలిపారు.

లాకర్‌లో 2-3 ప్యాకెట్ల బంగారం మినహా దాదాపు రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ సంఘటన కేవలం 10 నిమిషాల్లోనే జరిగిందని బ్రాంచ్ మేనేజర్ సత్య ప్రధాన్ అన్నారు. దోపిడీ జరిగినప్పుడు సీసీటీవీ కెమెరా పనిచేయలేదని ప్రధాన్ తెలిపారు. ఇదే సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో కూడా ఐఐఎఫ్ఎల్ యొక్క లూధియానా శాఖలోనూ ఇదే విధమైన దోపిడీ జరిగింది. అప్పుడు కూడా నలుగురు సాయుధ వ్యక్తులు ఆఫీసులోకి ప్రవేశించి రూ. 13 కోట్ల విలువైన 30 కిలోల బంగారం మరియు రూ. 3.5 లక్షల నగదు దోచుకొనిపోయారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!