Share On

ఆన్‌లైన్‌లో ఇక‌పై ర‌మ్మీ ఆట ఆడుతే క‌ఠిన‌శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని చెపుతోంది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. ఆన్‌లైన్ ర‌మ్మీని రాష్ట్రంలో నిషేధించామ‌ని, ఐనా ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించి ఆడినా, గేమింగ్ హౌస్ న‌డిపినా రెండు సంవత్స‌రాల జైలుతో పాటు, 5వేల జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు తెలిపింది. ఆన్‌లైన్ ర‌మ్మీ ఆట ఒక వ్య‌స‌నంగా మారి, ఎంతోమంది డ‌బ్బులు కొల్పోయి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అందుకే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన‌ట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ శుక్రవారం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

ఆన్‌లైన్‌ రమ్మీకి ప్రచారం చేసినందుకు ఇటీవల క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, సౌరభ్‌ గంగూలీ, నటులు ప్రకాష్‌రాజ్‌, సుదీప్‌, రానా, తమన్నాలకు మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఆదేశించింది. మదురైకి చెందిన మహ్మద్‌ రజ్వీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం ఆట కోసం ప్రచారం చేస్తున్న ప్రముఖులు ప్ర‌జ‌ల జీవితాల‌ను ప‌ట్టించుకోకుండా వారి స్వార్థం కోసం, డ‌బ్బుల కోసం మాత్ర‌మే ప‌నిచేస్తున్నార‌ని తెలిపింది. ఏ రంగానికి చెందిన ప్ర‌ముఖులైనా ప్ర‌చారం చేసే ముందు అది ప్ర‌జ‌ల‌కు ఎంత‌మేర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో, దాని వ‌లన ప్ర‌జ‌ల‌కు ఏదైనా ఇబ్బంది ఉందో ఆలోచించుకోవాల‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!