Share On

త‌న‌పై అత్యాచారం చేశాడు.. త‌న జీవితాన్ని నాశ‌నం చేశాడు.. నిందితుడికి క‌ఠిన‌శిక్ష వేసి త‌న‌కు న్యాయం చేయాల‌ని ఒక మ‌హిళ త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌క‌క్కింది.. ఆ మ‌హిళ ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న న్యాయ‌స్థానం అత్యాచారం చేశాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడికి శిక్ష విధించింది చైన్నై కోర్టు. అత్యాచారం ఆరోప‌ణ‌ల‌తో అరెస్టై ఏడు సంవ‌త్స‌రాల‌కు పైగా విచార‌ణ‌ను ఎదుర్కొన్న నిందితుడు అస‌లు అత్యాచారం తాను చేయ‌లేద‌ని, త‌న‌కు ఆ కేసుకు సంబంధం లేద‌ని వాదించాడు. మ‌రీ అవ‌స‌ర‌మైతే అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళకు జన్మించిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల‌ని కోరారు. నిందితుడు కోరిక మేర‌కు డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అత‌నికి, ఆ మ‌హిళ‌కు పుట్టిన బిడ్డ‌కు అస‌లు డీఎన్ఏ క‌‌ల‌వ‌నే లేదు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేసి, జీవితాన్ని నాశనం చేశారంటూ సదరు వ్యక్తి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తనకు రూ.30 లక్షల మేర పరిహారం కోరుతూ సంతోష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను చైన్నై న్యాయస్థానం విచారించింది.

అత్యాచారం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడికి ఉపశమనం లభించింది. అత్యాచారం ఆరోపణలతో అరెస్టయి ఏడేళ్లకుపైగా విచారణను ఎదుర్కొన్న వ్యక్తికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని చెన్నై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అతడి వాదనల్లో న్యాయముందని తేల్చిన కోర్టు పరిహారం చెల్లించాలని తప్పుడు ఆరోపణలు చేసిన మహిళ, ఆమె తల్లిదండ్రులకు ఆదేశించింది. తనపై ఆరోపణలు చేసిన మహిళ, ఆమె తల్లిదండ్రులు, కేసు దర్యాప్తు చేసిన చెన్నైలోని సెక్రటేరియట్ కాలనీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ల నుంచి రూ.30 లక్షల పరిహారం ఇప్పించాలని సంతోష్ డిమాండ్ చేశారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!