Share On

ఏ స‌మ‌యం ఎప్పుడు ఏలా ఉంటుందో ఎవ్వ‌రికి అర్ధం కాదు.. అన్ని స‌రియైన స‌మ‌యానికి జ‌రుగుతుందని అనుకుంటాం కాని ఒక్కోసారి ఊహించ‌ని ప‌రిణామాలు జ‌రుగుతాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లా క‌డ‌ప‌కు చెందిన ఒక యువ‌తి చైన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ప‌నిచేస్తోంది. అదే కంపెనిలో ప‌నిచేసే మ‌రో అబ్బాయిని ప్రేమించింది. ఈ విష‌యం త‌ల్లిదండ్రులకు చెప్ప‌క‌పోవ‌డంతో వారు అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి శుక్ర‌వారం పెళ్లి జ‌రిపించారు. ఇరువ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున బంధుమిత్రులు హ‌జ‌ర‌య్యారు, రిసెప్ష‌న్ కూడా బాగానే జ‌రిగింది. ఏలాంటి అటంకాలు లేకుండా జ‌రిగింద‌నుకున్న పెళ్లిలో పోలీసులు అనుకోకుండా రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఆగిపోయింది. అస‌లు కార‌ణ‌మేమంటే ఆమె ప్రియుడు తమిళనాడు పోలీసులకు, అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అత‌డి ఫిర్యాదు మేర‌కు స్థానిక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఇరుపక్షాల వారికి విషమేమిటో చెప్పారు. నవవధువును ప్రశ్నించడంతో తనకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చిచెప్పింది. ఉదయం 8 గంటల వరకు పంచాయితీ చేసినా నవ వధువు ప్రియుడుతో వెళ్లడానికి మొగ్గుచూపింది. దీంతో పెళ్లికొడుకు బృందం కల్యాణ మండపం వదిలి వెళ్లిపోయింది. పోలీసులు నవ వధువును, వారి తల్లిదండ్రులను స్థానిక తహశీల్దార్‌ అమరనాథ్‌ ముందు హాజరుపరిచారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకొన్న తహసీల్దార్‌ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం వేళ ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చివరకు పోలీసులు ప్రియుడిని, నవవధువు తల్లిదండ్రులను కడపకు పంపించి వేశారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!