Share On

న‌మ్మ‌కమే జీవితం అంటారు.. కాని సోష‌ల్ మీడియా పెరుగుతున్న కొద్ది న‌మ్మ‌కం అనేది ఎప్పుడో క‌నుమ‌రుగైపోయింది.. ఎప్పుడు ఎవ‌రూ న‌మ్మించి ఏలా మారుతున్నారో అర్థం కాని ప‌రిస్థితి.. ఫేస్‌బుక్‌లో, వాట్స‌ప్‌తో పాటు ఇత‌ర గ్రూపుల‌లో ఎవ‌రెవ‌రో ప‌రిచ‌యం అవుతూ మోసం చేస్తున్నారు. తాను ఆర్మీ అధికారిన‌ని మ్యాట్రిమోనియ‌ల్ సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్నాడు ఒక కేటుగాడు. మ‌హిళ‌ల‌ను ట్రాప్ చేస్తూ, ఖ‌రీదైన కార్ల‌లో తిరుగుతూ వారిని న‌మ్మించి భారీగా డ‌బ్బులు కాజేశాడు. మోస‌పోయామ‌ని తెలిసిన బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆర్మీ అధికారిగా చెలామణీ అవుతున్న శ్రీను నాయక్‌ని అరెస్టు చేశారు.

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ నేరేడ్‌మెట్‌లో స్థిరపడ్డాడు. తాను ఆర్మీ ఆఫీసర్‌నని, మేజర్ ర్యాంకులో ఉన్నట్లు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో ప్రకటనలిచ్చి మహిళలను ట్రాప్ చేసేవాడు. ఆర్మీ యూనిఫాంలో ఖరీదైన కార్లలో తిరుగుతూ ఆర్మీ అధికారిగా నమ్మించేవాడు. ఇప్పటి వరకు 17 మంది మహిళలను ట్రాప్ చేసిన ఆ కేటుగాడు వారి వ‌ద్ద నుంచి, సుమారు రూ.6.61 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మూడు డమ్మీ పిస్టల్స్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు నకిలీ యూనిఫామ్, ఐడీ కార్డ్స్, సర్టిఫికెట్లు, రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!