Share On

క‌రోనా వైర‌స్‌ను నివారించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. వైర‌స్ అనుమానం ఉంద‌ని ఎవ‌రూ వెళ్లిన దేశ‌వ్యాప్తంగా నిరంత‌రం క‌రోనా టెస్టులు చేస్తూనే ఉన్నారు. పండగ సీజన్‌తో పాటు చలికాలం కావడంతో కేసులు మ‌రింత‌ పెరిగే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన కేంద్ర ప్ర‌భుత్వం, అన్ని రాష్ట్రాలను మొద‌టి నుంచే అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భారీగా ప‌రీక్ష‌ల‌ సంఖ్యను పెంచాలని ప్ర‌తిరోజు విజ్ఞప్తి చేసింది. ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారిని గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని చెపుతోంది. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రోజుకు సగటున 10లక్షల పరీక్షలు చేస్తున్న అధికారులు, గడిచిన 24గంటల్లోనే 10,66,022 టెస్ట్‌లు చేసినట్టు కేంద్ర నివేదిక‌లో తెలిపింది. అక్టోబర్‌ 23 నుంచి నవంబర్‌ 21 వరకు 29 రోజుల్లో మరో 3 కోట్ల శాంపిల్స్‌ను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 13,06,57,808 శాంపిల్స్ సేక‌రించిన‌ట్టు వెల్లడించింది. క‌రోనా నివార‌ణ కోసం నిరంతరం ప‌రీక్ష‌లు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని, వ‌చ్చే సీజ‌న్ శీతాకాలం కావ‌డంతో ప్ర‌జ‌లంతా చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతేనే బ‌య‌టికి వెళ్లాల‌ని, బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు మాస్క్‌తో పాటు, భౌతిక‌దూరం పాటించాల‌ని సూచించింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *