Share On

ఎవ‌రూ ఆప‌ద‌లో ఉన్నార‌ని స‌మాచారం తెలిస్తే చాలు, నేనున్నానంటూ దేవుడిలా స‌హాయ‌, స‌హ‌కారాలు చేస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సోనూసూద్ పేద‌లకు భ‌రోసానిస్తూ వారికి అన్నిరకాలుగా స‌హాయ‌, స‌హాకారాలు అందిస్తున్నాడు. చిరునవ్వులు చిందించే ఒక చిన్నారి గుండె స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే విష‌యాన్ని తెలుసుకొని ఆ పాప చికిత్స కోసం సినీ న‌టుడు సోనూసూద్ రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక‌సాయం చేశాడు. కాని ఆ చికిత్స చేసినా మ‌ళ్లీ గుండెకు స‌మ‌స్య రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించింది.

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన ఈ చిట్టితల్లి గుండె సమస్యతో బాధపడుతోంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు తల్లిదండ్రులు. పాప ట్రీట్‌మెంట్‌ కోసం సినీ నటుడు సోనూసూద్‌ 2 లక్షల రూపాయల ఆర్థికసాయం చేశాడు. ఆ డబ్బుతో పాప త‌ల్లిదండ్రులు‌ ఇటీవలే గుండె ఆపరేషన్‌ చేయించారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న పాప మళ్లీ అనారోగ్యానికి గురైంది. గుండెకు నీరు పట్టడంతో విజయవాడ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ ట్రీట్‌మెంట్‌ చేయలేమని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. వైద్యుల సలహాతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ఆ చిట్టిత‌ల్లి కన్నుమూసింది. పాపే ప్రాణంగా బ‌తుకుతున్న ఆ త‌ల్లిదండ్రులు వేద‌న అరణ్య‌రోద‌న‌గా మారిపోయింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *