ఆ క‌లెక్ట‌ర్లు విడాకులకు ద‌ర‌ఖాస్తు చేశారు..

Share On

ఇద్ద‌రూ క‌లెక్ట‌ర్లు.. ఒక‌రెమో 2015లో ఆలిండియా ఐఎఎస్ టాప‌ర్ ఐతే, మ‌రొక‌రు ఆలిండియా సెకండ్ ర్యాంక‌ర్‌.. ఇద్ద‌రూ శిక్ష‌ణ కాలంలో మ‌న‌సు ప‌డ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కాని ఏమ‌యిందో, ఏమో తెలియ‌దు తాము ఇద్ద‌రం క‌లిసి ఉండ‌లేమ‌ని విడాకులు కావాల‌ని ఫ్యామిలీ కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్(2015) పరీక్షలో టీనా దాబి మొదటి ర్యాంకు సాధించిగా, అధర్ ఖాన్ రెండో ర్యాంకును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప‌రీక్షలో విజయం సాధించిన అనంతరం వారు ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందారు. అక్కడి పరిచయమే 2018లో వారు వివాహం చేసుకునేందుకు దారితీసింది. వారిద్దరు వేరువేరు మతాలకు చెందిన వారు కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వివాహం మతసామరస్యానికి చిహ్నమనే ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ మీ ప్రేమ మరింత దృఢంగా మారనుంది. అసహనం, విద్వేశపూరిత ఘటనలు జరుగుతున్న తరుణంలో మీరు భారతీయులకు స్ఫూర్తిగా నిలవొచ్చు అంటూ ఆ జంటకు అభినందనలు తెలియజేశారు. వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్, సుమిత్రా మహాజన్ వంటి ప్రముఖులు కూడా వారి వేడుకకు హాజరయ్యారు. కాని ఇరువురు తాము ఇష్ట‌పూర్వ‌కంగానే విడిపోవాల‌నుకుంటున్నామ‌ని విడాకులు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!