Share On

ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం ప‌నిచేయ‌మ‌ని నెల నెల జీతాలు ఇస్తుంటే కొంత‌మంది పోలీసు అధికారులు కాసుల‌కు క‌క్కుర్తి ప‌డి ప్ర‌జ‌ల‌ను పీడిస్తూనే ఉన్నారు. ఎంతోమంది పోలీసు అధికారులు నీతిగా, నిజాయితీగా ప‌నిచేస్తూ ప్ర‌జ‌ల్లో మంచి పేరు సంపాదిస్తుంటే, కొంద‌రూ మాత్రం మామూళ్లు లేనిదే న్యాయం చేయ‌క‌పోగా, పైళ్లు క‌ద‌ల్చ‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. నిజామాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ అవినీతి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే అందులో కామారెడ్డి డి.ఎస్.పి లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. దీంతో డీఎస్పీ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు సీజ్ చేసి, పోలీసు అతిథి గృహంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను విచారణ జరుపుతున్నారు. ఆధారాలు సేక‌రించిన త‌ర్వాత అత‌నిని కూడా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *