Share On

స్మార్ట్‌ఫోన్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌నిషి ఏలా మారుతున్నాడో, ఏలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడో అర్థ‌మే కావ‌డం లేదు. న‌డిరోడ్డుపై రోడ్డు దాటే ముందు, రైలు ప‌ట్టాలు దాటే ముందు చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఎవ‌రితో మాట్లాడుతూ వెళ్లేవారు కొంత‌మందైతే, పాటలు వింటూ ప‌క్క ప్ర‌మాదాన్ని ప‌ట్టించుకొని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇయర్‌ ఫోన్‌ పెట్టుకొని సరదాగా పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఒక‌ యువకుడిని రైలు ఢీకొట్ట‌గా ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని చింతల్‌లో రైలు పట్టాలపై జరిగింది. వరంగల్‌ జీఆర్పీ ఎస్‌ఐ పరశురాములు తెలిపిన వివరాల ప్రకారం చింతల్‌ చంద్రవదన కాలనీకి చెందిన అల్లూరి సునీల్‌ (28) రోజూ మాదిరిగానే పెయింటింగ్‌ పని కోసం వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇయర్‌ ఫోన్‌ పెట్టుకొని పాటలు వింటూ చింతల్‌లోని రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ఏడీఆర్‌ఎం స్పెషల్‌ రైలు ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!