Share On

ఒక‌రికి అన్యాయం జ‌రుగుతుందీ.. న్యాయం కావాలంటే ముందు స్థానికంగా ఉన్న అధికారుల‌ను క‌ల‌వాలి.. కాని స్థానిక అధికారులు ఎప్పుడు ఏ కోశాన స్పందించ‌రు.. ఎందుకంటే అక్క‌డ అన్యాయం చేస్తున్న‌వారు, క‌బ్జారాయుళ్లు దాదాపుగా స్థానిక నాయ‌కులై ఉంటారు. వారికి అధికారుల‌తో సంబంధాలు ఉండే ఉంటాయి. తన సమస్యపై స్థానిక యంత్రాంగం ఎంత చెప్పినా స్పందించ‌డం లేద‌ని ఒక వృద్ధుడు స్వగ్రామం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్‌ కార్యాలయానికి సైకిల్‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఒడిశాలోని నువాపడ జిల్లా బరపదర గ్రామానికి చెందిన గణపతి దురియా(65)కు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇల్లు మంజూరైంది. ఇల్లు కట్టేందుకు సిద్ధమవుతుండగా ఆయన స్థలం కబ్జాకు గురికావడంతో స్థానిక తహశీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఐనా ప్రయోజనం లేకపోవడంతో ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. అయినా చర్యలు లేకపోవడంతో కలెక్టరు కార్యాలయానికి సైకిల్‌పై బయల్దేరాడు. కరోనా నేపథ్యంలో కలెక్టరును కలిసేందుకు సిబ్బంది అనుమతించలేదు. కార్యాలయంలోని ఫిర్యాదుల పెట్టెలో తన వినతిపత్రాన్ని వేసి వెనుదిరిగాడు. ఎంతో దూరం నుంచి వ‌చ్చాన‌ని క‌నీసం దూరం నుంచైనా క‌ల‌వాల్సి ఉన్నా క‌ల‌వలేద‌ని ఆవేద‌న‌తో తిరిగి గ్రామానికి వెళ్లిపోయాడు ఆ వృద్దుడు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!