మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని మరోసారి రుజువు చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళలు లైన్మెన్ ఉద్యోగానికి ఎంపికై చరిత్ర సృష్టిస్తారు. మొదటగా రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వీరిని స్తంభాలు ఎక్కే ప్రాక్టికల్‌కు అధికారులు అడ్డు చెప్పడంతో వీరిద్దరూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ వీరికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో స్తంభాలెక్కే టాస్క్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసి ఉద్యోగాలను పొందారు. తెలంగాణ విద్యుత్ శాఖలో లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఎనిమిది మంది మహిళలు ఈ లైన్మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. ఆ 8 మందిలో భారతీ, శిరీష అనే ఇద్దరు మహిళలు రాత పరీక్షలో పాసై, పోల్ క్లైంబింగ్ కు క్వాలిఫై అయ్యారు. కానీ ఆడవారు అనే కారణంతో అధికారులు వీరిని రిజెక్ట్ చేశారు. దీంతో వాళ్లిద్దరూ కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పిచ్చింది.
రాత పరీక్షలో పాసవడంతో వారికి రెండో పరీక్ష పోల్ క్లైంబింగ్ పెట్టండి దాంట్లో పాస్ అయితే జాబ్ ఇవ్వాల్సిందేనని కోర్ట్ చెప్పడంతో విద్యుత్ శాఖ అధికారులు శిరీష, భారతీలకు పోల్ క్లైంబింగ్ పరీక్ష పెట్టగా 8 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని ఇద్దరు అవలీలగా ఎక్కి చూపించారు. దీంతో రెండు సంవత్సరాల న్యాయ పోరాటం తరువాత వీరిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. శిరీషకు ఇరవై సంవత్సరాలు కాగా, భారతి ఇద్దరు పిల్లల తల్లి. వీరిద్దరూ దేశ చరిత్రలో తొలి సారిగా లైన్ ఉమెన్స్ గా ఉద్యోగాన్ని సంపాదించి రికార్డు సృష్టించారు.