Share On

క‌రోనా లాక్‌డౌన్ ప్ర‌భావంతో చాలా మంది ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఉద్యోగులు చేస్తున్న వారు కూడా ఇంటినుంచే ఉద్యోగ విధులు నిర్వ‌హించారు. సాఫ్ట్‌వేర్ రంగం ఇప్ప‌టికి వ‌ర్క్ ఫ్రం హోం నిర్వ‌హిస్తోంది. వ‌ర్క్ చేస్తూ ఖాళీ సమ‌యం కూడా ఎక్కువ ల‌భించ‌డంతో గతం కంటే చాలా జంటలు సెక్స్​ లో అధికంగా పాల్గొన్నాయి. ఇంతకు ముందు సమయం లేక శృంగారంలో ఎక్కువగా పాల్గొనని దంపతులు సైతం లాక్​డౌన్​లో విరివిగా సెక్సువల్ లైఫ్​ ను ఎంజాయ్ చేశారని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. లాక్​డౌన్​లో విపరీతంగా పెరిగిన కండోమ్​ల అమ్మకాలు చూస్తేనే అర్ధ‌మైపోతుంది.

రాత్రి పూట కంటే పగలే కండోమ్​ల అమ్మకాలు విపరీతంగా జరిగాయని ఆన్​లైన్​ మార్కెట్​ డుంజో యాప్ వెల్లడించింది. గతంతో పోలిస్తే హైదరాబాద్​లో ఈ ఏడాది కండోమ్​ల అమ్మకాలు ఆరు రెట్లు పెరిగాయి. చెన్నైలో ఐదు, జైపూర్​లో నాలుగు రెట్లు, బెంగళూరు, ముంబైలో మూడు రెట్లు కండోమ్​ల వినియోగం పెరిగింది. దీంతో సురక్షిత సెక్స్​కే ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారని తెలుస్తోంది. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఉత్పత్పులైన గర్భనిరోధక మాత్రలు ఐపిల్​, ప్రెగ్నెసీ టెస్టింగ్ కిట్లు హైదరాబాద్​, ఢిల్లీ, బెంగళూరు, పుణె, గురుగ్రామ్​ల్లో అధికంగా అమ్ముడయ్యాయట. డుంజో యాప్ ద్వారా జై పూర్​లో ఈ కిట్లకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఇక ఆహారం విషయానికి వస్తే ఈసారి దేశవ్యాప్తంగా అత్యధిక మంది చికెన్ బిర్యానీనే ఇష్టపడ్డారు. డుంజో యాప్ ద్వారానూ ఈ బిర్యానీకి అధిక ఆర్డర్లు వచ్చాయట. ఎన్నడూ లేని విధంగా బెంగళూరులో ఈ ఏడాది చికెన్ బిర్యానీ అమ్ముడుపోయిందని ఆ యాప్ గణాంకాలు చెబుతున్నాయి.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!