రాజకీయ పార్టీ నిర్మాణంపై రజనీకాంత్ తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులతో పాటు నన్ను కూడా తీవ్ర నిరాశకు గురిచేసిందని ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ అన్నారు. కాని రాజకీయ పార్టీ కంటే అందరికి రజనీ ఆరోగ్యమే ముఖ్యమని కమల్ స్పష్టం చేశారు. తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రజనీకాంత్‌ను కలుస్తానని కమల్‌హాసన్ అన్నారు. రజనీ పార్టీ పెడుతున్నారని ప్రకటించిన తర్వాత, ఆయన పార్టీతో పొత్తుపై గతంలో కమల్ స్పందించారు. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందని, తమ ఇద్దరి సిద్ధాంతాలు ఒకటే అయితే అహాలను పక్కన పెట్టి కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కమల్ అప్పట్లో స్పష్టం చేశారు.