Share On

త‌ప్పు చేస్తే ఎవ‌రైనా ఒక‌టే అని నమ్ముతూ, వృత్తినే దైవంగా భావించే అధికారులు చాలా త‌క్కువ మంది ఉంటారు. అలాంటిదే రుణాల యాప్ కేసులో జ‌రిగింది. చైనా కంపెనీలు కేవలం ఆరు నెల‌ల్లో రూ.21 వేల కోట్లు కొల్లగొట్టాయి. ఈ కంపెనీల ఆర్థిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు పర్యవేక్షిస్తున్నాడు. ఇతని సోదరుడు ఈశ్వర్‌కుమార్‌ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. నాగరాజును రెండురోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ వెనుక నాగరాజు తండ్రి, పోలీస్‌ అధికారి పాత్ర ఉంది. తన కుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని, ఘరానా నేరానికి పాల్పడ్డాడని ఆ పోలీస్‌కు కొద్దిరోజుల క్రితమే తెలిసింది. ఈ విషయాన్ని నాగరాజుకు తెలియ‌నియ్య‌కుండా, ఏలాంటి అనుమానం రాకుండా కర్నూలుకు రావాలని చెప్పారు. మూడు రోజుల క్రితం అతను ఇంటికి చేరగానే, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్‌ చేయించారు. బంధం కంటే పోలీసు బాధ్యత గొప్పదని భావించిన పోలీస్‌ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఒక‌ పోలీస్‌ ఠాణాలో ఏఎస్సైగా పనిచేస్తున్నానని, తనపేరు, వివరాలు బహిర్గతం చేయవద్దంటూ ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. ఏఎస్ఐకు ఇద్దరు కుమారులు ఈశ్వర్‌కుమార్‌, నాగరాజు. వీరు బెంగళూరులో కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసేవారు. తొలుత నాగరాజు యాప్‌ రుణాల సంస్థలో చేరాడు. తర్వాత తన అన్న ఈశ్వర్‌కుమార్‌ను అందులోనే చేర్పించాడు. పోలీసులు నాగరాజును అరెస్టు చేయడంతో ఈశ్వర్‌కుమార్‌ సైతం లొంగిపోయినట్లు తెలిసింది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!