ఆ యువకుడు గతంలో సైన్యంలో పనిచేశాడు. సైన్యంలో పనిచేస్తున్న సమయంలో రోనిత్‌కు 2017లో వెన్నుకు గాయమైంది. గాయం కారణంగా రోనిత్ తన ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోక తప్పలేదు. ఆ సమయంలో అతను డిప్రెషన్‌కు గురయ్యాడు. తర్వాత అతను కొన్ని రోజులు చికిత్స తీసుకొని మామూలుగా మనిషిగా మారిపోయాడు. అప్పటి నుంచి రోనిత్ ప్రజల్లో మానసిక ఆందోళనపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరినీ కలవడం ద్వారానే ఎక్కువ మందిలో దీనిపై అవగాహన కల్పించవచ్చనే లక్ష్యంతో రోనిత్ ఈ నడక ప్రారంభించాడు. రోనిత్ మాట్లాడుతూ నవంబరు 16న కన్యాకుమారిలో ఈ నడక ప్రారంభించాను. దేశం మొత్తం నడుస్తూ లడక్‌లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తానని తెలిపాడు. ప్రస్తుతం రోనిత్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. రాంచీకి చెందిన రోనిత్ రంజాన్ వయస్సు 23 సంవత్సరాలు కాగా, అతను నడవాల్సిన గమ్యం 4 వేల కిలోమీటర్లు అని సిద్దం చేసుకొని నడుస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ యువకుడు 1,250 కిలోమీటర్లు వరకు నడిచాడు. మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశ్యంతో నడుస్తున్నరోనిత్ నడక ఏలాంటి అవరోధాలు, అడ్డంకులు కలుగకుండా సాగాలని కొరుకుందాం.