ఆంధ్రాలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు, ఎక్కడ ఏమి జరుగుతుందో, ఎవరూ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే మళ్లీ విజయవాడలో మరో సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహం ధ్వంసమైంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పనిచేశారా, లేక కిందపడి విగ్రహం పగిలిపోయిదా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారోమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుకలు లేదా గాలికి విగ్రహం కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ చెప్పడంతో ఘటనా స్థలికి చేరుకున్న తెదేపా నేత పట్టాభిరామ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండా ఎలా నిర్థారణకు వస్తారని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.