Share On

మ‌రొక‌రికి ప్రాణం పోసి, ఆప‌ద‌లో అండ‌గా నిలవాల్సిన ఒక వైద్యురాలు క‌న్న‌కొడుకుతో స‌హా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. రాజమండ్రికి చెందిన‌ వైద్యురాలు తన కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారిపోయింది. వారిద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదంనెలకొంది. క‌ల‌హాలే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయ‌ని చెపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక దేవీచౌక్‌ ప్రాంతంలోని బుద్ధుడు ఆసుపత్రి వైద్యుడు డి.బుద్ధుడు కుమార్తె డాక్టర్‌ దొంతంశెట్టి లావణ్య చర్మవ్యాధుల నిపుణురాలిగా సేవలందిస్తున్నారు. ఆమెకు కొన్నేళ్ల కిందట వరంగల్‌ ప్రాంతానికి చెందిన వైద్యుడు వంశీకృష్ణతో పెళ్లి జరిగింది. ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి భర్తతో లావణ్యకు విభేదాలు వచ్చాయి. దీంతో రెండు నెలల కిందట ఆమె రాజమహేంద్రవరంలో పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఇటీవల లావణ్యకు తన భర్త నుంచి విడాకుల నోటీసు వచ్చింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న ఆమె శుక్రవారం రాత్రి తన కుమారుడు నిశాంత్‌ కు నిద్రమాత్రలు ఇచ్చి తాను ఆ మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ఉన్న ఒక‌ ప్రైవేటు ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. వెంట‌నే వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోవ‌డంతో చివరికి ప్రాణాలు విడిచారు. ఈ మృతిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె భర్తే వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి బుద్ధుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!