Share On

ఒక్కోసారి కొన్ని సంఘ‌ట‌న‌లు తెలిసి జ‌రుగుతాయో, తెలియ‌క జ‌రుగుతాయో అర్థ‌మే కాదు. ఇంటిలో ప్రేమ‌గా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఆ ఇంటి వారికి తీర‌ని విషాదాన్ని నింపింది. చాలా మంది ఇండ్ల‌లో పెంపుడు కుక్కలు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయి. కుక్క‌కు ఇచ్చిన ఇష్టానుసార‌మే ఆ ఇంటి ముద్దుల పాప ప్రాణం తీసింది. ఆ శున‌కం తెలిసో, తెలియ‌కో నాలుగు నెలల పాపపై కూర్చొని ఆ శునకం ఊపిరి ఆడకుండా చేసింది. అంత బరువైన జంతువు మీద కూర్చొవడంతో ఊపిరి అందక ఆ చిన్నారి విలవిలలాడింది. చివరికి ప్రాణం వదిలింది.

అమెరికాలోని ఓహియో డైటాన్​లో రేలిన్ హారిసన్ కుటుంబం నివాసం ఉంటుంది. వారు పెంపుడు కుక్క‌ను పెంచుకుంటారు. కుక్క పాప‌పై ఎగ‌ర‌డం, కూర్చోవ‌డం వ‌ల్ల పాపకు ఊపిరి ఆడడం లేదు అంటూ ఆ తండ్రి కన్నీరు మున్నీరు అయ్యాడు. వెంటనే 911 ఎమర్జెన్సీ నంబర్​కు కాల్ చేశాడు. పాపను చూసేందుకు వైద్యులు వచ్చినా అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు. చూడడానికి ఆ శునకం పెద్దగా ఉంటుందని, అది ఇంట్లో స్వేచ్ఛగానే తిరుగుతుండేదని చెప్పారు. పెంపుడు జంతువులను కంట్రోల్ చేయకుంటే ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పసిపిల్లల దగ్గరికి బరువుగా ఉండే జంతువులు ఎట్టిపరిస్థితుల్లోనూ జాగ్రత్త పడాలని సూచించారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!