Share On

మ‌హిళ‌ల‌పై వేధింపులు, అత్యాచారాలు నిత్యం ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర అత్యంత దారుణంగా జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రిగే దేశమంటూ ప్ర‌పంచంలో ఎక్క‌డ లేదు. ఒక మ‌హిళ‌పై అత్యాచారం అనేది అత్యంత దారుణ‌మైన క్ష‌మించ‌రాని విష‌యం. కాని ఒక మ‌హిళ త‌న‌పై అత్యాచారం చేసిన రేపిస్టును క్ష‌మించి త‌న ఔదార్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

లైంగిక హింసకు గురైన 25 ఏళ్ల కెనడా మహిళ 4 గంటల పాటు ఆవిడ‌పై అత్యాచారం చేసిన‌ నిందితుడితో మాట్లాడిన తర్వాత రేపిస్టును క్షమించింది. ఆమె ఇప్పుడు అత్యాచారం, హింసతో బాధపడుతున్న మహిళలకు సహాయం చేస్తోంది. అంటారియో నివాసి మార్లీ లిస్ మాట్లాడుతూ నిందితుడిని శిక్షించే బదులు, బాధితుల గాయాలను నయం చేయడం, వారికి కొత్తగా జీవించే అవకాశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం 2019లో మార్లీ లిస్ తన పై అత్యాచారం చేసిన రేపిస్టుతో సుమారు 4 గంటలు మాట్లాడిన తర్వాత రేపిస్టును క్షమించింది. ఆమె ఒక చెడ్డ గతాన్ని మరచిపోయి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అప్పటి నుండి ఆమె తనలాగే లైంగిక హింసకు గురైన మహిళలకు సహాయం చేస్తోంది. మార్లి లిస్ మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 40 మంది మహిళలతో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఒక మహిళ తనపై జరిగిన హింస తరువాత మేము ఆమెకు చికిత్స చేయడం, ఇబ్బంది పడకుండా చూడటం, ఆమె తన శరీరాన్ని ప్రేమించడం వంటి వాటిపై కృషి చేస్తాము.

కెనడియన్ మీడియా మార్గదర్శకాల ప్రకారం అత్యాచారం లేక లైంగిక బాధితుల అనుమతి లేకుండా ఆమె అసలు పేరును వెల్లడించే హక్కు మీడియాకు లేదు, మార్లి లిస్ కూడా దీనిని అంగీకరించారు. మార్లి లిస్ లైంగిక హింసకు గురైన మహిళలకు వారి హక్కుల గురించి తెలుసుకోవటానికి, వారికి న్యాయం చేయడానికి పనిచేసే ‘రీ హ్యూమనైజ్’ అనే సంస్థను కూడా ప్రారంభించింది. లైంగిక బాధితులు వారి అవకాశాల గురించి తెలుసుకోవడం న్యాయ వ్యవస్థలో పనిచేసే వారికి అవగాహన కల్పించడంతో మొదలవుతుందని, న్యాయ వ్యవస్థలో పనిచేసే వారు అవగాహన కల్పించడం ద్వారా దీన్ని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు మార్లి లిస్ చెప్పారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!