Share On

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అప్పులు రోజురోజుకు కొండ‌లా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే అప్పులు సుడిగుండంలో ఉన్న రాష్ట్రానికి క‌రోనా లాక్‌డౌన్ తోడ‌వ‌డంతో ఆదాయం మ‌రింత‌గా వెనుక‌బ‌డిపోయింది. అప్పులు పెరిగిపోతున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాత్రం ప్ర‌భుత్వ ప‌థకాల అమలులో మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ప‌థ‌కాల కోసం విప‌రీతంగా అప్పులు చేస్తూ ఖ‌ర్చు పెడుతూనే ఉన్నారు. ఈ సంవ‌త్స‌రం రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణలో భాగంగా నవంబరు నెలాఖరు వరకు జగన్ సర్కారు ఆర్థిక సంవ‌త్స‌రం మ‌రో మూడు నెల‌ల ఉండ‌గానే వివిధ రూపాల్లో రూ. 73,811.85 కోట్లు అప్పుల రూపేణా సమకూర్చుకుంది.

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న అప్పుల‌తో ప్రతి ఒక్కరిపై దాదాపు రూ.70 వేల అప్పు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్కో తలపై చేసిన తలసరి అప్పు దాదాపు రూ.13 వేల పైమాటే. రాష్ట్ర జనాభా 2020లో తాజా అంచనాల ప్రకారం 5.39 కోట్లు ఉంటుందని లెక్క కడుతున్నారు. దీని ఆధారంగా మొత్తం రుణాన్ని జనాభాతో హెచ్చవేస్తే తలసరి అప్పు రూ. 13,694 వరకు తేలింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ చేసిన మొత్తం అప్పును లెక్కిస్తే అది ఒక్కొక్కరిపై రూ.70 వేల వరకు ఉండబోతోంది. అధికారిక ఇంకా లెక్క‌లు తేలాల్సి ఉంది. 2019 ఏప్రిల్‌ నుంచి వైసీపీ ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అప్పు రూ. లక్ష కోట్లు దాటింది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2019- 20లో దాదాపు రూ. 45 వేల కోట్లు రుణంగా సమీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాగ్‌ తేల్చిన లెక్కల ప్రకారం ఇప్పటికే రూ.73 వేల కోట్ల వరకు రుణం ఉంది. ఇంకా డిసెంబర్ నెల లెక్కలు తేలాలి. రాబోయే మూడు నెలల్లో మరింతగా రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఒక్కొక్కరి తలపై ఇంకా మరింత అప్పు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!