Share On

కండ్ల‌ముందే చెట్టంత కొడుకు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. ఒకానొక్క కొడుకు మ‌ర‌ణించేస‌రికి ఆ తండ్రి త‌ట్టుకోలేక‌పోయాడు. క‌న్నీరుమున్నీరుగా రోదించాడు. త‌న కొడుకు అవ‌య‌వాల‌ను దానం చేసి మ‌రికొంద‌రి ప్రాణాల‌ను కాపాడాల‌నుకున్నాడు అందుకే త‌న గుండెను మ‌రొక‌రికి దానం చేశాడు. ఇప్పుడు త‌న కొడుకు గుండెను రోజు వింటూ ఆ తండ్రి క‌న్నీరుమున్నీర‌వుతున్నాడు.

అమెరికాకు చెందిన జాన్‌ రెయిడ్ ఒక‌ ప్రమాదంలో తన 16 ఏళ్ల కొడుకుని కోల్పోయాడు. 2019 లో డిన్విడ్డీ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జాన్‌ రెయిడ్‌ కుమారుడు మరణించాడు. దీంతో తన కొడుకు చనిపోయినా ఆ బాధలో కూడా జాన్ రెయిడ్ పెద్ద మనస్సు చేసుకున్నాడు. తన కొడుకు తనకు దూరమైనా మరికొంతమంది జీవించాలనుకున్నాడు. దీంతో తన కొడుకు అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోశాడు. జాన్ రెయిడ్ కొడుకు అవయవాలు అమర్చుకున్నవారిలో మసాచుసెట్స్‌కు చెందిన రాబర్ట్ ఒకరు. రాబర్ట్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ తప్పనిసరి అని డాక్టర్లు తెలిపారు. దీంతో బతకాలనే ఆశతో కొట్టుమిట్టాడుతున్న రాబర్ట్‌కు జాన్‌ రెయిడ్‌ కుమారుడి గుండెని డాక్టర్లు అతడికి అమర్చారు. రాబర్ట్‌ కోలుకుని ఇంటికి వెళ్లిన తరువాత తన ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు కారణం తనకు గుండెను దానం చేసినవారి పుణ్యమేనని వారికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతన్ని దేవుడిగా భావించి ధన్యవాదాలు తెలిపాడు.

ఆ తరువాత తనకు గుండె దానం చేసి పునర్జన్మనిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు. దాంతో తన గుండె చప్పుడుని రికార్డు చేసి ఒక‌ టెడ్డీ బేర్ బొమ్మలో దాన్ని అమర్చి, దాన్ని జాన్ రెయిడ్‌కు గిఫ్టుగా పంపించాడు. నన్ను కూడా మీ కొడుకే అనుకోండి అంటూ తెలిపాడు. రాబర్ట్‌ పంపిన గిఫ్ట్‌బాక్స్‌ని ఓపెన్‌ చేసిన రెయిడ్‌ దానిలోని టెడ్డీ బేర్ బొమ్మను బయటకు తీసి చెవి దగ్గర పెట్టుకుని చనిపోయిన తన కొడుకు ‘గుండె చప్పుడు’ విన్నాడు. ఒక్కసారిగా ఆపుకోలేని భావోద్వేగానికి గురయ్యాడు. స్వయంగా కుమారుడే తన దగ్గర ఉన్నట్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు రెయిడ్‌. ఆ గుండె చప్పుడు వింటూ కన్నీటి తడిసిపోయాడు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!