Share On

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప బెంగుళూరు న‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీ నోటిఫికేషన్‌ ద్వారా ఆయ‌న‌ లబ్ధి పొందారన్న ఆరోపణలపై కేసు న‌మోద‌యింది. య‌డ్యూర‌ప్ప‌పై నమోదైన కేసు దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ఆదేశించింది. యడియూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేసేందుకు ధర్మాసనం ఇప్పటికే నిరాకరించింది. దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్‌ మైకేల్‌ డి కున్హా రూ.25 వేల జరిమానా విధించారు. సామాజిక కార్యకర్త జయకుమార్‌ హీరేమఠ దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ విచారణ కొనసాగుతోంది. 2015లో యడియూరప్పతో పాటు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై కలబురగి హైకోర్టు సంచార పీఠంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. డీనోటిఫికేషన్‌ ద్వారా కుమారస్వామి బంధువులకూ లబ్ధి చేకూరిందని హీరేమఠ ఆరోపించారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!