Share On

క‌రోనా రాక‌ముందు వారంతా ప్రైవేట్ పాఠ‌శాల‌లో విద్యను బోధించే ఉపాధ్యాయులు. గురువు అంటేనే స‌మాజంలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు. అలాంటి గురువులు నేడు పాఠ‌శాల‌లు మూత‌బ‌డ‌టంతో బ‌తుకుదెరువు కోసం చిన్న‌చిన్న వ్యాపారాలు చేస్తూ బ‌తుకుబండిని లాగిస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఏదో ఒక ప‌నిచేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధి పోయేస‌రికి బ‌త‌క‌డం కోసం ఏదో ఒక ప‌ని చెయ్య‌క త‌ప్ప‌డం లేదు.

నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్ద‌రు భార్యాభర్తలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేసేవారు. పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న చిరంజీవి ఉన్నత తరగతులకు గణితం బోధించేవారు. ఆయనకు, భార్యకు కలిపి యాజ మాన్యం రూ.25 వేల వేతనం ఇచ్చేది. కుటుంబం హాయిగా గడిచేది. కరోనాతో పాఠశాలలు మూతపడి ఆర్థిక పరి స్థితులు తలకిందులయ్యాయి.కొందరు మిత్రుల సలహాతో టిఫిన్‌ సెంటర్‌ పెట్టాడు. ప్రతి రోజుకు ఖర్చులుపోను రూ.1,000 నుంచి 1,500 వరకు మిగులుతున్నాయని ఆ దంపతులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన మద్ది వెంకటేశ్వర్లుతోపాటు అతని భార్య కూడా స్థానికంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ జీవ‌నం గ‌డిపేవారు. వారి ఇద్దరు పిల్లలను కూడా చదివించేవారు. కాని కరోనాతో పాఠశాలలు మూతపడ‌టంతో, ఎంతోమంది ఉపాధ్యాయులు జీవితాలు ఆగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయాయి. వీరికి ప‌నులు లేక‌, జీతాలు రాక బ‌తుకు సాగ‌డ‌మే ఇబ్బందిక‌రంగా మారిపోయింది. వెంకటేశ్వర్లు గతంలో నేర్చుకున్న ఎలక్ట్రీషియన్‌ పనిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు రోజుకు 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఇప్పుడు వేల‌ల్లో ఉన్నారు. కొంత‌మంది ఏదో ఒక ఉపాధి మార్గాన్నిఎంచుకుంటే, మ‌రికొంత‌మంది వృత్తి ప‌నివైపే మొగ్గుచూపుతున్నారు.


Share On

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Alert: Content is protected !!